Home » Author »Narender Thiru
ఐపీఎల్-2022లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటముల నేపథ్యంలో తిరిగి మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై తలపడుతోంది.
మాతృభాషలో విద్యావిధానం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు. సమగ్ర విద్యావిధానం, శాంతియుత వాతావరణం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది అని వెంకయ్య అన్నారు.
ఫ్యాషన్ ఎక్కువగా ఫాలో అయ్యే హీరోయిన్లలో తమన్నా ఒకరు. తమన్నా ఏదైనా పబ్లిక్ ఈవెంట్ లేదా సినిమా ఫంక్షన్‌కు గానీ హాజరైందంటే ఆమె డ్రెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయం.
అప్పుడప్పుడూ జంతువులు చేసే పనులు కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా సీ లయన్ చేసిన ఒక పని కూడా నవ్వులు పూయిస్తోంది.
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో ఏప్రిల్ నెల రికార్డు సాధించింది. ఏప్రిల్ నెలలో అత్యధికంగా రూ.1,67,540 కోట్ల వసూళ్లు సాధించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం ప్రకటించింది.
ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫాం అమెజాన్ సమ్మర్ సేల్ అనౌన్స్ చేసింది. ఈ నెల 4 నుంచి సమ్మర్ సేల్ ప్రారంభం కానుంది. మూడు బ్యాంకులకు చెందిన కార్డులపై పదిశాతం డిస్కౌంట్ కూడా ప్రకటించింది.
దేశంలో అవసరాలకు సరిపడా వంటనూనెల నిల్వలు ఉన్నాయని వెల్లడించింది కేంద్రం. ప్రస్తుతం 21 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలున్నాయని, ఈ నెలలో మరో 12 లక్షల మెట్రిక్ టన్నుల నూనెలు రానున్నాయని కేంద్రం చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 60.88 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పెన్షన్లు అందనున్నాయి.
గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్లో మహిళపై అత్యాచారం జరగటం అత్యంత బాధాకరం అన్నారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజిని. రేపల్లె అత్యాచార ఘటనపై రజిని ఆదివారం మీడియాతో మాట్లాడారు.
తెలుగు రాష్ట్రాలు విడిపోయాక నటీనటులు అవార్డులు విషయంలో నిరాదరణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించాలని కోరారు.
పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రం లీకైందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. బుధవారం నుంచి పదో తరగతి పరీక్షలు మొదలైన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీకి తన అవసరం లేదని, ఆ పార్టీ సొంతంగా నిలదొక్కుకోగలదని అభిప్రాయపడ్డారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే). తమ పార్టీలో చేరడంపై కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనను ఇటీవల పీకే తిరస్కరించిన సంగతి తెలిసిందే.
స్టార్ హీరోయిన్ సమంత బర్త్‌డే సందర్భంగా స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్. గురువారం సమంత పుట్టిన రోజు. పుట్టిన రోజున సమంత.. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్లో భాగంగా కాశ్మీర్లో ఉంది.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్. అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న కమల్ నాథ్, ఆ పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెనాలిలో ఉద్రిక్తత నెలకొంది. వేమూరు నియోజకవర్గంలో హత్యకు గురైన రూపా శ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తెనాలి ఆసుపత్రికి నారా లోకేష్ వస్తుండటంతో, ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఆర్డర్ అనాలసిస్ ప్రకారం గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది హైదరాబాద్‌లో హలీం ఆర్డర్లు 33 రెట్లు పెరిగాయట. దీంతోపాటు హైదరాబాదీలు చికెన్ బిర్యానీ కూడా ఎక్కువగానే ఆర్డర్ చేస్తున్నారట.
విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యం వికటించి నీరజ అనే తొమ్మిది రోజుల బాలింత మరణించింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె మృతి చెందిందంటూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు.
తాను సీఐతో మాట్లాడింది వాస్తవమని, ఒక్కరు కాదు.. ఇద్దరు సీఐలతో మాట్లాడానని.. అయితే, తన మాటలను వక్రీకరించారని ఆరోపించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.
వైసీపీ ప్రభుత్వం నాడు-నేడు అంటూ ప్రచారం చేసుకోవడం తప్ప.. ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ కోసం చేసిందేమీ లేదని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.
ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకం మహిళల అభివృద్దికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. స్థానిక కందుకూరి కల్యాణ మండపంలో జరిగిన సున్నా వడ్డీ మూడో విడత పంపిణీ కార్యక్రమంలో మల్లాది పాల్గొన్నారు.