Health Tips: రోజు పప్పు తింటున్నారా? అయితే గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
భారతీయ ఆహార వ్యవస్థలో పప్పులుక్ చాలా ప్రాధాన్యత ఉంది(Health Tips). ముఖ్యంగా కూరల్లో పప్పులను ఎక్కువగా వాడుతారు. వీటిలో ప్రోటీన్,

Health Tips: Eating too many pulses can cause gastric problems.
Health Tips: భారతీయ ఆహార వ్యవస్థలో పప్పులుక్ చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా కూరల్లో పప్పులను ఎక్కువగా వాడుతారు. వీటిలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, ఇతర మినరల్స్ అధికంగా ఉండటం వల్ల శారీరక ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి, చాలా మంది కూరగాయాలకన్నా ఎక్కువగా వంటల్లో పప్పులను వాడుతారు. అయితే, పప్పులు తిందాం మంచిదే కానీ, కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులలో ఎక్కువగా పప్పు కూరలు తినడం(Health Tips) వల్ల ఎసిడిటీ, బ్లోటింగ్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మరి ఆ పరిస్థితి ఎందుకు వస్తోంది? దీనికి కారణాలేంటి? ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయం గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Kidney Health: ఈ కూరగాయలు చేసే మాయ.. కిడ్నీలు మొత్తం క్లీన్.. మీరు కూడా ట్రై చేయండి
పప్పులు తినడం వల్ల ఎసిడిటీకి కారణాలు ఏమిటి?
1. పప్పుల్లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు:
పప్పుల్లో ఓలిగోశాకరైడ్స్ (Oligosaccharides) అనే రకమైన కాంప్లెక్స్ షుగర్లు అధికంగా ఉంటాయి. ఇవి పూర్తిగా జీర్ణం కావు. పెద్ద పేగులోకి వెళ్లాక దీనిపై బ్యాక్టీరియా చేరుతుంది. దాంతో గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల బ్లోటింగ్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ లాంటి భావనలు కలుగుతాయి.
2.ఎక్కువ మోతాదులో తినడం:
రోజూ అధిక పరిమాణంలో పప్పు తినడం వల్ల దానిలోని ప్రోటీన్లను జీర్ణం చేయడానికి ఎక్కువ ఆమ్లరసం అవసరమవుతుంది. ఇది కొంతమందిలో ఎసిడిటీ సమస్యను ప్రేరేపించవచ్చు.
3.ఇతర పదార్థాలు:
పప్పు కూరలతో పాటు ఎక్కువ మిర్చి, ఉప్పు, ఉల్లిపాయ, నూనె వంటివి కూడా కూరల్లో వాడుతారు. అవి కూడా ఎసిడిటీని పెంచే అవకాశం ఉంది. ఈ పదార్థాలతో కలిపి తీసుకున్నప్పుడు సమస్య ఎక్కువగా అనిపించవచ్చు.
జాగ్రత్తలు & నివారణలు:
పప్పులను నానబెట్టి వాడడం:
కూరల్లో వాడే ముందు కనీసం 4 నుంచి 8 గంటల పాటు పప్పులను నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ సృష్టించే పదార్థాలు కొంత మేర తగ్గిపోతాయి.
జీర, ఇంగువ వంటివి వాడటం:
పప్పు కూరల్లో వీటిని వాడటం వల్ల జీర్ణక్రియకు సహాయపడతాయి. జీలకర్ర, ఇంగువను పప్పులో కలిపితే ఎసిడిటీ తగ్గుతుంది.