Home » Author »Narender Thiru
పార్టీలో చేరే అంశంపై కాంగ్రెస్ ప్రతిపాదనను ప్రశాంత్ కిషోర్ (పీకే) తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పరిణామాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముందే ఊహించారని అంటున్నాయి పార్టీ వర్గాలు.
గత ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత, రాష్ట్రంలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ హింసలో బాధితుల తరఫున వాదిస్తున్న లాయర్లు, బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితుడు, 36 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న పెరారివాలన్‌ను ఎందుకు విడుదల చేయకూడదని కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీం కోర్టు. నిందితుడిని విడుదల చేయకూడదు అనేందుకు కారణాలు తెలపాలని జస్టిస్ ఎల్
భారత్ లేకుండా ప్రపంచంలోని ఏ ప్రధాన సమస్యా పరిష్కారం కాదన్నారు జర్మన్‌కు చెందిన మంత్రి డా.టొబియాస్ లిండ్నర్. జర్మనీకి, భారత్ ప్రధాన భాగస్వామి అన్నారు.
ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే ప్రశ్నాపత్రం లీక్ కావడం సంచలనం సృష్టిస్తోంది. బుధవారం ఉదయం తెలుగు పరీక్ష మొదలైన కొద్దిసేపటికే ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో ప్రత్యక్షమైంది.
రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులపై సబ్సిడీని కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. గత ఏడాదితో పోలిస్తే 50 శాతం సబ్సిడీని పెంచారు.
ఆర్ఐతోపాటు, రెవెన్యూ సిబ్బంది లంచం డిమాండ్ చేస్తూ, తమపై దాడికి దిగారని మట్టి మాఫియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆర్ఐ అరవింద్‌పై సెక్షన్ 323, 506, 384, 511 కింద గుడివాడ రూరల్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
వైసీపీ కీలక నేతలతో ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలుగు దేశం నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ విజయవాడలో బుధవారం ధర్నా నిర్వహించారు. జగన్ ప్రభుత్వంలో మహిళలపై దారుణాలు పెరిగిపోయాయని, దిశ చట్టం పేరుతో్ ప్రభుత్వం ఆర్భాటం చేయడం తప్ప చర్యలు
తెలంగాణ నీటిని ఏపీ వాడుకుంటోందని, గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తోందని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎమ్బీ) దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్.
ఆంధ్రప్రదేశ్‌లో మాఫియా రాజ్ పాలన నడుస్తోందని, ఎక్కడ చూసినా మాఫియా రాజ్ అరాచకాలే కనిపిస్తున్నాయని విమర్శించారు టీడీపీ నేత నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గం, తాడేపల్లి రూరల్, వడ్డేశ్వరం గ్రామంలో పర్యటించిన లోకేష్, వైసీపీ ప్రభుత్వంపై విమర్శ�
భర్తపై తప్పుడు రేప్ కేసు పెట్టిన భార్యకు పదివేల రూపాయల ఫైన్ విధించింది అలహాబాద్ కోర్టు. చట్టాన్ని, న్యాయాన్ని దుర్వినియోగం చేయకూడదని, దీనివల్ల కోర్టు సమయం వృథా అవుతుందని పేర్కొంది.
తెలంగాణ నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. 503 పోస్టులతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మంగళవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.
హనుమాన్ చాలీసా వివాదం నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన ఎంపీ నవనీత్ కౌర్, ఎమ్మెల్యే రవి రాణాను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, జైల్లో పోలీసుల వైఖరి అనుచితంగా ఉందంటూ నవనీత్ కౌర్ ఆరోపించింది.
పాకిస్తాన్‌లోని కరాచీ యూనివర్సిటీలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చైనీయులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఢిల్లీలోని దొంగబాబా ఆశ్రమంపై తెలంగాణ దంపతులు జరిపిన పోరాటం ఫలించింది. ఢిల్లీలోని రోహిణి జిల్లాలో ఉన్న వీరేంద్ర దీక్షిత్ ఆశ్రమ బాధ్యతలను ఢిల్లీ హైకోర్టు కిరణ్ బేడీకి అప్పగించింది.
కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ (పీకే) చేరతారా.. లేదా అని కొంతకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ చేరడం లేదని తేలిపోయింది.
పరిటాల శ్రీరామ్ భారీ కాన్వాయ్‌తో జాతరకు బయలుదేరారు. అయితే, మార్గమధ్యంలో పోలీసులు శ్రీరామ్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.
మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. బుధ, గురు వారాల్లో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
దళితుల అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా దళిత బంధు తీసుకొచ్చారని అన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.