Paritala SriRam: పరిటాల శ్రీరామ్‌ను అడ్డుకున్న పోలీసులు
పరిటాల శ్రీరామ్ భారీ కాన్వాయ్‌తో జాతరకు బయలుదేరారు. అయితే, మార్గమధ్యంలో పోలీసులు శ్రీరామ్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.

Paritala Sriram
Paritala SriRam: అనంతపురం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. రామగిరి మండలం రెడ్డివారి పల్లి గ్రామంలో జరుగుతున్న ఊరి జాతరకు వెళ్తున్న టీడీపీ నేత పరిటాల శ్రీరామ్(Paritala SriRam)ను పోలీసులు అడ్డుకున్నారు. పరిటాల శ్రీరామ్ భారీ కాన్వాయ్‌తో జాతరకు బయలుదేరారు. అయితే, మార్గమధ్యంలో పోలీసులు శ్రీరామ్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. అదే జాతరకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వర్గం వచ్చారని, పరిటాల కూడా భారీ కాన్వాయ్‌తో అక్కడికి చేరుకుంటే.. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తి, శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు.
Read This : Paritala sriram: కేతిరెడ్డి.. టీడీపీ నాయకులను గెలుక్కున్నవ్.. నిన్నువదలం.. ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తా..
ఈ నేపథ్యంలో కాన్వాయ్‌లోని అన్ని వాహనాలకు అనుమతి ఇవ్వడం కుదరదని, రెండు వాహనాల్లో మాత్రమే వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో పరిటాలతోపాటు తెలుగుదేశం నాయకులు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో పరిటాల అనుచరులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం తలెత్తింది.
Read This : Nirupam Paritala : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో డాక్టర్ బాబు