Orange Shark: అమ్మ బాబోయ్..! ఇదేంటి ఇలా ఉంది.. షార్క్ కలర్ చూసి షాక్.. వీడియోలు వైరల్.. ఎందుకిలా..

వారు ఫోటోలు తీసి దానిని వదిలేశారు. దీని గురించి సముద్ర నిపుణులకు వివరించారు. చూడటానికి గోల్డ్ ఫిష్ లా ఉందని చెప్పారు.

Orange Shark: అమ్మ బాబోయ్..! ఇదేంటి ఇలా ఉంది.. షార్క్ కలర్ చూసి షాక్.. వీడియోలు వైరల్.. ఎందుకిలా..

Updated On : August 28, 2025 / 8:02 PM IST

Orange Shark: షార్క్ లు సాధారణంగా గ్రే, వైట్, బ్రౌన్ రంగుల్లో ఉంటాయి. కొన్ని జాతులకు చెందిన షార్క్ లు ఎల్లో కలర్ లో కూడా ఉంటాయి. ఇది సహజం. అయితే, ఇందుకు భిన్నంగా ఓ షార్క్ కనిపించింది. దాని రంగు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇదేంటి ఇలా ఉంది అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ షార్క్ ఏ కలర్ లో ఉందో చెప్పలేదు కదూ.. ఆరెంజ్ కలర్ లో. అవును.. ఆరెంజ్ కలర్ లో కనిపించిన షార్ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గత సంవత్సరం కోస్టారికాలోని టోర్టుగురో నేషనల్ పార్క్ సమీపంలో అరుదైన ప్రకాశవంతమైన నారింజ రంగు సొరచేప కనిపించింది. శాస్త్రవేత్తలు ఇటీవల మెరైన్ బయాలజీ జర్నల్‌లో నారింజ రంగు సొరచేప చిత్రాలను ప్రచురించారు. ఈ రంగులో ఉన్న సొరచేపను కనుగొనడం ఇదే మొదటిసారి అని చెప్పారు.

ఈ చిత్రాలు గత సంవత్సరంలో తీసినవి. పారిసిమా డోమస్ డీ అనే పర్యాటక సంస్థ పేజీలో పోస్ట్ చేశారు. ఈ సంస్థ కొంతమంది జాలర్లతో కలిసి ఫిషింగ్ ట్రిప్‌లో ఉన్నప్పుడు 37 మీటర్ల లోతు, 31.2 డిగ్రీల సెల్సియస్ నీటి ఉష్ణోగ్రత వద్ద ఈ అరుదైన చేప కనిపించింది.

వారు ఫోటోలు తీసి దానిని వదిలేశారు. దీని గురించి సముద్ర నిపుణులకు వివరించారు. చూడటానికి గోల్డ్ ఫిష్ లా ఉందని చెప్పారు.

ఆరెంజ్ కలర్ లో ఎందుకు ఉంది?
నారింజ రంగు సొరచేప ఒకటి కాదు, రెండు అరుదైన జన్యు పరిస్థితుల ఫలితంగా వస్తుంది. అల్బినిజం, జాంథిజం (జాంథోక్రోయిజం అని కూడా పిలుస్తారు) కలయిక. ఈ పరిస్థితి మెలనిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. కాగా, ఈ పరిస్థితి సొరచేపల వంటి చేపలలో చాలా అరుదు అని పరిశోధకులు చెబుతున్నారు. జీవుల చర్మంలో ముదురు వర్ణం కోల్పోయినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అంటే పసుపు లేదా నారింజ రంగు మరింత బలంగా వస్తుంది.

ఈ సొరచేప నారింజ రంగులో తెల్లటి కళ్ళతో ఉంటుంది. ఇది సాధారణ గోధుమ రంగు షార్క్‌ల నుండి ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ప్రత్యేకమైన రంగు దీనిని.. వేటాడే జంతువులకు మరింత హాని కలిగించేలా చేస్తుంది. ఈ ఆరెంజ్ కలర్ షార్క్.. స్థానిక నర్స్ షార్క్ జనాభా జన్యు వైవిధ్యం గురించి విస్తృత ప్రశ్నలకు దారితీస్తుందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.

జంతు రాజ్యంలో జాంథిజం చాలా అరుదుగా పరిగణించబడుతుంది. గతంలో కొన్ని చేపలు, సరీసృపాలు, పక్షులలో ఇది గమనించబడింది. కరేబియన్‌లోని కార్టిలాజినస్ చేపలలో జాంథిజం మొదటి డాక్యుమెంట్ కేసు ఇది. “సొర చేపలలో ఈ అరుదైన రంగు మార్పునకు కారణమయ్యే జన్యు లేదా పర్యావరణ కారకాలను తెలుసుకోవడానికి మరింత పరిశోధన అవసరం” అని పరిశోధకులు తెలిపారు.

Also Read: మీకు చేపలు అంటే ఇష్టమా.. కానీ, ఈ చేపలను మాత్రం పొరపాటున కూడా తినకండి.. జాగ్రత్త సుమీ