Best Electric Cars : కొత్త ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా? రూ. 20 లక్షల లోపు 4 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఏది కొంటారో కొనేసుకోండి
Best Electric Cars : కొత్త ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా? రూ. 20లక్షల లోపు ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

Best Electric Cars
Best Electric Cars : కొత్త ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా? ప్రస్తుత రోజుల్లో పెట్రోల్, డీజిల్ కార్ల కన్నా ఈవీ కార్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. చాలామంది వాహనదారులు ఎలక్ట్రిక్ కార్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రూ. 20 లక్షల వరకు ఖరీదైన బెస్ట్ ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం..
టాటా నెక్సాన్ ఈవీ నుంచి టాటా టిగోర్ ఈవీ వరకు ఏయే ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.. ధర ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ఇందులో మీకు నచ్చిన ఎలక్ట్రిక్ కారును ఎంచుకుని ఇంటికి తెచ్చుకోవచ్చు.
టాటా నెక్సాన్ ఈవీ :
టాటా నెక్సాన్ ఈవీ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ SUV కారు. అద్భుతమైన పర్ఫార్మెన్స్, నెక్సాన్ ఈవీ సింగిల్ ఛార్జ్‌పై 465 కి.మీ రేంజ్ అందిస్తుంది. మీరు సుదూర ప్రయాణాలలో సులభంగా ప్రయాణించేందుకు వీలు కల్పిస్తుంది. స్పోర్టీ లుక్స్, ప్రీమియం ఇంటీరియర్స్ అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్లతో ఫ్యామిలీలు, యువతకు సరైన కారుగా చెప్పొచ్చు.
Read Also : Vivo X300 Launch : కొత్త వివో X300 సిరీస్ వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే?
హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ :
మీరు ఫ్యూచర్ డిజైన్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోరుకుంటే హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ బెస్ట్ ఆప్షన్. ఈ కారు 452 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఇన్ స్టంట్ టార్క్ హై స్పీడ్ అందిస్తుంది. కోన ఎలక్ట్రిక్ లోపలి భాగంలో భారీ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, సన్‌రూఫ్, కనెక్టివిటీ ఆప్షన్లు వంటి అడ్వాన్స్ ఫీచర్లు ప్రత్యేకంగా ఉంటాయి. హ్యుందాయ్ డిజైన్ క్వాలిటీ, బ్రాండ్ వినియోగదారులను ఆకర్షించేలా ఉంటుంది.
మహీంద్రా XUV400 ఈవీ :
పవర్, స్పేస్ రెండింటినీ కోరుకునే వారికి మహీంద్రా XUV400 ఈవీ సరైన ఆప్షన్. ఈ కారు 456 కి.మీ రేంజ్ అందిస్తుంది. స్పీడ్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకునేలా ఉంటుంది. మహీంద్రా XUV400 ఇంటీరియర్ చాలా విశాలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. మహీంద్రా సర్వీస్ నెట్‌వర్క్, లాంగ్ బ్యాటరీ లైఫ్ వినియోగదారులను మరింతగా ఆకట్టుకుంటుంది.
టాటా టిగోర్ ఈవీ :
మీరు సెడాన్ బాడీ టైప్ ఎలక్ట్రిక్ కారును ఇష్టపడితే.. టాటా టిగోర్ ఈవీ కన్నా బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదు. ఈ కారు 315 కి.మీ రేంజ్ అందిస్తుంది. సిటీ రైడర్లకు చాలా బెస్ట్. టిగోర్ ఈవీ లోపల చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ప్రత్యేకంగా ఉంటాయి. టాటా బ్యాటరీ టెక్నాలజీతో రన్నింగ్ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది.