Vivo X300 Launch : కొత్త వివో X300 సిరీస్ వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే?

Vivo X300 Launch : వివో నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. వివో X300 లాంచ్ డేట్, కెమెరా ఫీచర్లు, ధరకు సంబంధించి లీక్ వివరాలు ఇలా ఉన్నాయి.

Vivo X300 Launch : కొత్త వివో X300 సిరీస్ వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే?

Vivo X300 Launch

Updated On : August 28, 2025 / 6:57 PM IST

Vivo X300 Launch : వివో అభిమానులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో వివో నుంచి మరో కొత్త సిరీస్ ఫోన్ రాబోతుంది. వివో X300 ఫోన్ లాంచ్ కానుంది. కెమెరా ఫీచర్లలో (Vivo X300 Launch) వివో ఫోన్లకు ఫుల్ క్రేజ్ ఉంది. వివో X200 ప్రో ఫ్లాగ్‌షిప్ సెగ్మంట్‌లో ఫొటోగ్రఫీ-సెంట్రలైజడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది.

ఇప్పుడు వివో X300 సిరీస్, వివో X300 ప్రోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలి లీక్‌లను పరిశీలిస్తే.. కెమెరాలలో పెద్ద మార్పులు, పవర్ ఫుల్ హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లు, లాంచ్ టైమ్‌లైన్ వివరాలు రివీల్ అయ్యాయి. వివో X300 ఫోన్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

వివో X300 సిరీస్ స్పెసిఫికేషన్లు (అంచనా) :
వివో ఇప్పటికే X300 లైనప్ కింద రెండు కొత్త మోడళ్లను రివీల్ చేసింది. ఈ వివో రాబోయే మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ప్రీమియం ఫ్లాగ్‌షిప్ అక్టోబర్‌లో గ్లోబల్ లాంచ్ విండోను సూచించింది. భారత మార్కెట్లో కొంచెం ఆలస్యంగా ఈ ఫోన్‌లను రిలీజ్ చేసే అవకాశం ఉంది.

Read Also : Best Vivo Phones : వివో ఫోన్లు భలే ఉన్నాయి.. రూ. 15వేల లోపు ధరలో టాప్ 3 వివో ఫోన్లు మీకోసం.. ఏది కొంటారో మీఇష్టం

వివో 3 వెర్షన్లతో (X200, X200 ప్రో, వివో X200 ప్రో మినీ) వచ్చిన వివో X200 సిరీస్ లాంచ్ సమయంలో కాకుండా వివో X300 లైనప్‌లో రెండు మోడళ్లు మాత్రమే ఉండవచ్చు. లీకులను పరిశీలిస్తే.. వివో Zeissతో భాగస్వామ్యాన్ని కొనసాగించనుంది. కెమెరాలపై Zeiss లేయర్ కలర్-కచ్చితమైన ఫోటోగ్రఫీని అందించనుంది.

వివో X300 కెమెరా అప్‌గ్రేడ్‌లు (అంచనా) :
వివో X300 సిరీస్ కెమెరాలు, నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ అప్ గ్రేడ్ సెన్సార్లతో రానుందని అధికారికంగా సూచించింది. నివేదికల ప్రకారం.. వివో X300 సిరీస్‌లో 50MP సోనీ LYT828 సెన్సార్‌తో పాటు కొత్త 200MP శాంసంగ్ సెన్సార్ ఉండవచ్చు. వివో V1, వివో V3 ప్లస్ ఇమేజింగ్ చిప్‌లతో కలిపి లో-లైటింగ్ ఫొటోగ్రఫీ మొత్తం కెమెరా పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

వివో X300 ధర, లాంచ్ తేదీ (అంచనా) :
వివో X200 ధర విషయానికి వస్తే.. రూ. 65,999కి లాంచ్ అయింది. హార్డ్‌వేర్, కెమెరా అప్‌గ్రేడ్స్ అంచనాల ప్రకారం.. వివో X300 దాదాపు రూ.69,999 నుంచి ఉంటుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2025లో లాంచ్ అవుతుందని పుకార్లు ఉన్నప్పటికీ, డిసెంబర్ 2025 నాటికి భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.