Best Vivo Phones : వివో ఫోన్లు భలే ఉన్నాయి.. రూ. 15వేల లోపు ధరలో టాప్ 3 వివో ఫోన్లు మీకోసం.. ఏది కొంటారో మీఇష్టం
Best Vivo Phones : వివో ఫ్యాన్స్ మీకోసమే.. భారత మార్కెట్లో రూ. 15వేల లోపు ధరలో టాప్ 3 వివో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.. ఏ ఫోన్ కొంటారంటే?

Best Vivo Phones
Best Vivo Phones : వివో అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త వివో ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఈ వివో ఫోన్లలో బిగ్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ బ్యాటరీ బ్యాకప్, క్వాలిటీ కెమెరా సెటప్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ అందించే గేమింగ్ చిప్‌సెట్ వంటి అన్ని ట్రెండింగ్ ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఫోన్లను ఎక్కువగా వాడినా కూడా ఎలాంటి లాగ్ లేదా హీటింగ్ ఇష్యూ ఉండదు. ఫ్లిప్‌కార్ట్ లైవ్ సేల్‌లో ఈ వివో స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను పొందవచ్చు. భారత మార్కెట్లో రూ. 15వేల బడ్జెట్‌లోపు టాప్ 3 బెస్ట్ ఫోన్లను కొనుగోలు చేయొచ్చు.
1. వివో T4x 5G :
వివో T4x 5G ఫోన్ 6.72 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 1050 నిట్స్ వరకు గరిష్ట ప్రకాశాన్ని పొందవచ్చు. ఈ ఫోన్‌ను నేరుగా సూర్యకాంతిలో కూడా ఉపయోగించవచ్చు. ఈ ఫోన్‌లో 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉన్నాయి. కెమెరా క్వాలిటీతో అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. ఈ ఫోన్ 6500mAh లాంగ్ బ్యాటరీతో వస్తుంది. 44 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
Read Also : Apple iPhone 16 Pro : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ క్రేజీ డీల్ అసలు మిస్ చేయొద్దు..!
ఈ ఫోన్ IP64 దుమ్ము, నీటి నిరోధకతతో డ్రాప్స్, షాక్‌లకు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమన్షిటీ 7300 చిప్‌సెట్ కలిగి ఉంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్‌లో 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో పొందవచ్చు. ఈ ఫోన్ రూ. 13,999తో కొనుగోలు చేయొచ్చు.
Best Vivo Phones : 2. వివో T3x 5G :
వివో T3x 5G ఫోన్ 6.72 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 1000 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. బ్యాక్ సైడ్ 50MP డ్యూయల్ కెమెరా లభిస్తుంది. ఫ్రంట్ సైడ్ 8MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో 4GB, 6GB లేదా 8GB ర్యామ్ వంటి వివిధ కాన్ఫిగరేషన్‌లలో పొందవచ్చు.
అయితే, మైక్రో SD కార్డ్ ద్వారా ఇంటర్నల్ స్టోరేజీని 1TB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ 6000mAh లాంగ్ బ్యాటరీ కలిగి ఉంది. సాధారణ వినియోగంలో 2 రోజులు ఛార్జింగ్ వస్తుంది. ఈ బ్యాటరీని త్వరగా ఛార్జ్ చేసేందుకు 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు లభిస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌తో వస్తుంది. గేమింగ్ సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ 4GB ర్యామ్, 128GB బేస్ వేరియంట్ దాదాపు రూ. 12,499కు సొంతం చేసుకోవచ్చు.
3. వివో Y28 5G :
వివో Y28 5G ఫోన్ 6.56 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50MP డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. రెండు వైపులా కెమెరాలు క్లారిటీ ఫొటోలను అందిస్తాయి. ఈ ఫోన్‌ను 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో పొందవచ్చు.
ఈ వివో ఫోన్ 5000mAh లాంగ్ బ్యాటరీతో 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ IP54 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను కూడా అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13పై ఫన్‌టచ్ OS13తో రన్ అవుతుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో గేమింగ్ ప్రాసెసర్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. వివో Y28 5G ఫోన్ రూ. 12,999తో కొనుగోలు చేయొచ్చు.