Apple iPhone 16 Pro : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ క్రేజీ డీల్ అసలు మిస్ చేయొద్దు..!
Apple iPhone 16 Pro : ఆపిల్ ఐఫోన్ 16 ప్రోపై భారీ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Apple iPhone 16 Pro
Apple iPhone 16 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 16 ప్రో ధర తగ్గింది. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్‌కు ముందే ఐఫోన్ 16 ప్రో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ లైనప్‌కు (Apple iPhone 16 Pro) సంబంధించి అనేక డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రొ వేరియంట్ డిజైన్ మార్పులు, ప్రాసెసర్ అప్‌గ్రేడ్‌ల విషయానికి వస్తే.. ఐఫోన్ 16 ప్రో బెస్ట్ ఆప్షన్ కావచ్చు. ప్రస్తుతానికి, ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 16 ప్రోపై క్రేజీ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ప్రో ధర తగ్గింపు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో అసలు ధర రూ.1,19,900 నుంచి రూ.1,05,900కు లభిస్తుంది. అంతేకాకుండా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులందరూ స్టేట్‌మెంట్ త్రైమాసికానికి రూ.4వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఐఫోన్ 16 ప్రో ఫోన్ బ్లాక్ టైటానియం, డెసర్ట్ టైటానియం అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఐఫోన్ 16 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో 6.3-అంగుళాల LTPO సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్ కలిగి ఉంది. ఈ ఐఫోన్ ప్యానెల్ సిరామిక్ షీల్డ్ గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఐఫోన్ iOS18పై రన్ అవుతుంది. స్టేబుల్ వెర్షన్ తర్వాత మీరు లేటెస్ట్ iOS 26 కి కూడా అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 3nm ప్రాసెస్ ఆధారంగా ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్‌లో రన్ అవుతుంది.
ఆప్టిక్స్ పరంగా ఆపిల్ ఐఫోన్ 16 ప్రో 48MP ప్రైమరీ లెన్స్, 12MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 48MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కు సపోర్టు ఇచ్చే 12MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 25W మ్యాగ్ సేఫ్, 15W Qi2, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 3582mAh బ్యాటరీతో వస్తుంది.