Patnam Mahender Reddy: నా మాటలు వక్రీకరించారు: పట్నం మహేందర్ రెడ్డి

తాను సీఐతో మాట్లాడింది వాస్తవమని, ఒక్కరు కాదు.. ఇద్దరు సీఐలతో మాట్లాడానని.. అయితే, తన మాటలను వక్రీకరించారని ఆరోపించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.

Patnam Mahender Reddy: నా మాటలు వక్రీకరించారు: పట్నం మహేందర్ రెడ్డి

Patnam Mahender Reddy

Updated On : April 28, 2022 / 3:55 PM IST

Patnam Mahender Reddy: తాను సీఐతో మాట్లాడింది వాస్తవమని, ఒక్కరు కాదు.. ఇద్దరు సీఐలతో మాట్లాడానని.. అయితే, తన మాటలను వక్రీకరించారని ఆరోపించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. సీఐని పట్నం మహేందర్ రెడ్డి దుర్భాషలాడిన ఆడియో క్లిప్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై పట్నం వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Tandur TRS : పట్నం మహేందర్ రెడ్డికి మరో షాక్.. మరో కేసు

‘‘రోహిత్ రెడ్డి పక్కన ఇద్దరు రౌడీషీటర్లు ఉన్నారు. వాళ్లలో జగన్ అనే వ్యక్తి మొన్ననే జైలు నుంచి వచ్చాడు. నేను తాండూరు ప్రజలను రౌడీషీటర్లు అనలేదు. రోహిత్ పక్కన ఉన్న కొందరు కార్యకర్తలను ఉద్దేశించి అన్నాను. సీఐతో మాట్లాడింది వాస్తవం. అయితే, నా మాటలను వక్రీకరించారు. తాండూరులో ఇసుక దందా జరుగుతోందన్నది వాస్తవం. ఆ విషయం అందరికీ తెలుసు. తాండూరులో ధర్నా చేసింది టీఆర్ఎస్ కార్యకర్తలు కాదు. కాంగ్రెస్ కార్యకర్తలు. సీఐ ఎంత అవినీతికి పాల్పడింది ప్రజలకు తెలుసు. అవినీతి సొమ్ముతోనే అక్రమ బిల్డింగులు కడుతున్నాడు. ఈ పంచాయితీ కేసీఆర్, కేటీఆర్ దగ్గరే తేల్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను’’ అని వ్యాఖ్యానించాడు.

Tandur MLA Vs MLC : తాండూరు తగదా..ఎమ్మెల్యే Vs ఎమ్మెల్సీ, అసలు ఏమి జరిగింది ?

మరోవైపు ప్రస్తుత తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, తనకు అసలు పోటీయే కాదన్నాడు. ‘‘రోహిత్ అసలు నాకు పోటీయే కాదు. ఆయన గురించి ఎంత తక్కువగా మాట్లాడితే, అంత మంచిది. తాండూరులో నేనే సీనియర్. కేటీఆర్, కేసీఆర్ నాకే టికెట్ ఇస్తారు. రోహిత్ రెడ్డి వన్ టైమ్ ఎమ్మెల్యే. మళ్లీ గెలవడం జరగదు. టీఆర్ఎస్ కార్యకర్తలు నన్నే పోటీ చేయమని అడుగుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు సానుభూతితో రోహిత్ రెడ్డికి ఓటు వేశారు. నేను ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నానని అంటున్నాడు. కానీ, నేను హ్యాపీగా ఉన్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు పట్నం.