Patnam Mahender Reddy : : పట్నం మహేందర్ రెడ్డికి మరో షాక్.. మరో కేసు

పట్నం మహేందర్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు వెంట లేకుంటే అడుగు బయటపెట్టగలరా అని ప్రశ్నించారు. సీఐకి వెంటనే బేషరతుగా మహేందర్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని..

Patnam Mahender Reddy : : పట్నం మహేందర్ రెడ్డికి మరో షాక్.. మరో కేసు

Tandur

Updated On : April 28, 2022 / 3:55 PM IST

Patnam Mahender Reddy : ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మెడకు మరోకేసు చుట్టుకుంది. రెండు రోజుల క్రితం తనపై దురుసుగా ప్రవర్తించారంటూ ఎస్‌ఐ అరవింద్‌పై పట్నంపై కేసు పెట్టారు. అసభ్యకర పదాలతో తనను దూషించిచారన్నారు. ఎస్‌ఐ కంప్లైంట్‌తో యాలాల పోలీసు స్టేషన్‌లో మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ సెక్షన్‌ 355, 504, 526 కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు మహేందర్‌రెడ్డికి వ్యతిరేకంగా స్థానిక ఎమ్మెల్యే అనుచరులు నిరసనలకు దిగారు. ఎమ్మెల్యే టికెట్‌పై టీఆర్‌ఎస్‌ అదిష్టానం తేల్చాలంటున్నారు గులాబి కార్యకర్తలు.

Read More : Tandur MLA Vs MLC : తాండూరు తగదా..ఎమ్మెల్యే Vs ఎమ్మెల్సీ, అసలు ఏమి జరిగింది ?

మహేందర్‌ రెడ్డి అనుచరులు రెచ్చగొడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మేల్యే టికెట్‌పై క్లారిటీ ఇస్తే జిల్లాలో గ్రూప్‌ రాజకీయాలు ఉండవన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఐపీసీ 353, 504, 506 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు తాండూరు పోలీసులు. తాండూరు సీఐ రాజేందర్‌రెడ్డిని దూషించడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. సీఐ రాజేందర్‌రెడ్డిని అసభ్య పదజాలంతో మహేందర్‌రెడ్డి దూషించడంపై రాష్ట్ర పోలీస్‌ అధికారుల సంఘం ఘాటుగా స్పందించింది. సభ్య సమాజం భరించలేని తిట్లతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

Read More : Telangana : సీఐని దూషించిన ఆడియో నాది కాదు..నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: పట్నం మహేందర్ రెడ్డి

పట్నం మహేందర్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు వెంట లేకుంటే అడుగు బయటపెట్టగలరా అని ప్రశ్నించారు. సీఐకి వెంటనే బేషరతుగా మహేందర్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి వర్గీయులు ఆందోళన చేపట్టారు. తాండూరులోని ఇందిరా ధర్నా చౌక్‌లో నిరసన తెలిపారు. సీఐకి మద్దతుగా నినాదాలు చేశారు. ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ఈ ఇష్యూతో మరోసారి విభేదాలు బయటపడ్డాయి.