Andhra Pradesh: పొదుపు పథకంతో మహిళల అభివృద్ది: మల్లాది విష్ణు
ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకం మహిళల అభివృద్దికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. స్థానిక కందుకూరి కల్యాణ మండపంలో జరిగిన సున్నా వడ్డీ మూడో విడత పంపిణీ కార్యక్రమంలో మల్లాది పాల్గొన్నారు.

Malladi Vishnu
Andhra Pradesh: ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకం మహిళల అభివృద్దికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. స్థానిక కందుకూరి కల్యాణ మండపంలో జరిగిన సున్నా వడ్డీ మూడో విడత పంపిణీ కార్యక్రమంలో మల్లాది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గంలో దాదాపు రూ.170 కోట్లు ఈ పథకం ద్వారా అర్హుల ఖాతాలో పడ్డాయని చెప్పారు. ‘‘ఇది మహిళా సంక్షేమ రాజ్యం. సీఎం జగన్ మహిళలకు పెద్దపీట వేశారు. కేబినెట్‌లో మహిళలకు సీఎం అవకాశం కల్పించారు.
Andhra Pradesh : జగన్ తరువాత నెంబర్ 2 అతనేనా? వైసీపీలో కీలక మార్పులు..
ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో మహిళలు సంతోషంగా ఉన్నారు. పథకాల విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. ఎల్లో మీడియా ప్రభుత్వ పథకాలను వక్రీకరిస్తోంది. టీడీపీ నేతలకు అమ్మఒడి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. టీడీపీ నాయకులు మహిళలను చిన్నచూపు చూశారు. ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు’’ అని మల్లాది అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి, స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు.