Ashok Gehlot: మత ఘర్షణల్ని ప్రోత్సహిస్తున్న బీజేపీ: రాజస్థాన్ సీఎం
దేశవ్యాప్తంగా మత ఘర్షణల్ని బీజేపీ ప్రోత్సహిస్తోందని, ముఖ్యంగా రాజస్థాన్‌లో ఘర్షణలకు బీజేపీనే కారణమని ఆరోపించారు ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్.

Ashok Gehlot warns bjp
Ashok Gehlot: దేశవ్యాప్తంగా మత ఘర్షణల్ని బీజేపీ ప్రోత్సహిస్తోందని, ముఖ్యంగా రాజస్థాన్‌లో ఘర్షణలకు బీజేపీనే కారణమని ఆరోపించారు ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్. రాజస్థాన్‌లో గత ఏప్రిల్ 2 నుంచి ఈ నెల 3 వరకు మూడుసార్లు మత ఘర్షణలు చెలరేగాయి. అవి కూడా పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ‘‘రాజస్థాన్‌లోని కరౌలీలో హింస మొదలైంది. అక్కడ్నుంచి మెల్లిగా ఏడు రాష్ట్రాల్లో ఘర్షణలు తలెత్తాయి. ఈ అల్లర్లకు కారణం బీజేపీనే’’ అని అశోక్ గెహ్లాట్ అన్నారు.
Rajasthan Curfew : జోద్‌పూర్‌లో ఉద్రిక్తత.. రేపు రాత్రి వరకు కర్ఫ్యూ .. బయటకు వస్తే అంతే..!
‘‘అళ్వార్‌లో దేవస్థానాన్ని ధ్వంసం చేయాలన్నది బీజేపీ ఆలోచన. కానీ, వాళ్లు దానికి కాంగ్రెస్ పార్టీని నిందించారు. ఈ రోజు జోధ్‌పూర్‌లో ఘర్షణలకు కొన్ని అసత్య వార్తలు కారణం. ఇప్పటికే దేశంలో ఘర్షణలు జరుగుతుంటే, బీజేపీ వాటిని మరింత ప్రోత్సహిస్తోంది. రాజస్థాన్‌లో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ మొత్తం నా చేతిలో ఉంది. ఏ ఘటనపై ఎలా స్పందించాలి? రాష్ట్రంలో ఎలాంటి వాతావరణాన్ని సృష్టించాలి అనే దానిపై ఇక్కడి బీజేపీ నాయకులకు పైనుంచి ఆదేశాలు వస్తుంటాయి’’ అని అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. మత ఘర్షణల్ని ప్రధాని ఖండించాలని, కానీ ఈ విషయంలో ఆయనకు ఏం సమస్య అని అశోక్ ప్రధానిని ప్రశ్నించారు.