Basavaraj Bommai: కర్ణాటకలో సీఎం మార్పు.. అమిత్ షా చెప్పిందిదే

కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైను బీజేపీ అధిష్టానం మార్చబోతుందని కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. సీఎం బొమ్మైను మార్చబోవడం లేదని కేంద్రం హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

Basavaraj Bommai: కర్ణాటకలో సీఎం మార్పు.. అమిత్ షా చెప్పిందిదే

Basavaraj Bommai

Updated On : May 4, 2022 / 7:01 PM IST

Basavaraj Bommai: కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైను బీజేపీ అధిష్టానం మార్చబోతుందని కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. సీఎం బొమ్మైను మార్చబోవడం లేదని కేంద్రం హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ మేరకు అమిత్ షా, బొమ్మైకు హామీ ఇచ్చినట్లు సీఎం సన్నిహితవర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కూడా బొమ్మై నేతృత్వంలోనే జరుగుతాయని కూడా అమిత్ షా చెప్పినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అమిత్ షా మంగళవారం కర్ణాటకలోని బెంగళూరులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎంను మార్చబోతున్నారని ప్రచారం జరిగింది.

BJP-AAP: అరవింద్ కేజ్రీవాల్! జాతీయత ఏంటో తెలియాలంటే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి రండి: బీజేపీ

అయితే, తాజాగా ఈ విషయంపై అమిత్ షా స్పష్టతనిచ్చారు. బొమ్మై సన్నిహితుల చెబుతున్న వివరాల ప్రకారం.. నాయకత్వ మార్పు గురించి వస్తున్న వార్తలను పట్టించుకోవద్దని, అభివృద్దిపై దృష్టి సారించాలని అమిత్ షా, బొమ్మైకు సూచించారు. అభివృద్ది అంశంపైనే వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు చెప్పారు. ఈ విషయంలో మాజీ సీఎం యెడియూరప్ప కూడా సహకరిస్తారని అమిత్ షా భరోసా ఇచ్చారు. కాగా, త్వరలో కర్ణాటకలో చేపట్టబోయే మంత్రివర్గ కూర్పు గురించి కూడా బొమ్మై, అమిత్ షాతో చర్చించినట్లు సమాచారం.