Madhya Pradesh: యువతిని ఎత్తుకెళ్లి.. ఆపై సామూహిక అత్యాచారం

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఇరవై ఏళ్ల యువతిని అపహరించిన నలుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్‌లోని జైసినగర్ పట్టణ పరిధిలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.

Madhya Pradesh: యువతిని ఎత్తుకెళ్లి.. ఆపై సామూహిక అత్యాచారం

Madhya Pradesh

Updated On : May 6, 2022 / 7:12 PM IST

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఇరవై ఏళ్ల యువతిని అపహరించిన నలుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్‌లోని జైసినగర్ పట్టణ పరిధిలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. గురువారం రాత్రి యువతి, తన బావతో కలిసి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా నలుగురు యువకులు అడ్డగించారు. బైక్‌పై ఉన్న యువకుడిని కొట్టి, యువతిని తీసుకెళ్లారు. యువతిని దగ్గర్లోని అటవీ ప్రాంతానికి ఎత్తుకెళ్లిన నలుగురు వ్యక్తులు, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే, దాడి నుంచి తేరుకున్న యువతి బావ, స్థానికుల సహాయంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

Vijayawada Crime: యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్టు

దీంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వెతికారు. అక్కడ యువతితోపాటు, మరో ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నారు. అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారు. వీరిలో ఇద్దరిని పోలీసులు పట్టకోగా, మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.