Osmania University: ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఉద్రిక్తత

త్వరలో రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో పర్యటించనున్న నేపథ్యంలో, ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద విద్యార్థులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది.

Osmania University: ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఉద్రిక్తత

Osmania University

Updated On : May 4, 2022 / 2:06 PM IST

Osmania University: త్వరలో రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో పర్యటించనున్న నేపథ్యంలో, ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద విద్యార్థులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ, రాహుల్ గాంధీకి మద్దతుగా కొంతమంది విద్యార్థులు బుధవారం ర్యాలీ చేపట్టారు. అయితే, ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. కొందరు విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, రాహుల్ గాంధీని ఎలాగైనా ఓయూకు రప్పించి తీరుతామని నిరుద్యోగ ఫ్రంట్ స్పష్టం చేసింది.

Rahul gandhi: ఎవరీ సుమ్మిమా ఉదాస్..? ఆమెతో రాహుల్‌కున్న సంబంధమేంటి?

మరోవైపు ఓయూలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. రాహుల్ గాంధీ పర్యటనను స్వాగతిస్తూ వామపక్ష విద్యార్థి నేతలు యూనివర్సిటీలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్‌మీట్‌కు కూడా అనుమతి లేదని పోలీసులు దీన్ని అడ్డుకున్నారు. అనంతరం విద్యార్థులను అరెస్ట్ చేసి అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.