liquor loot: మద్యం వాహనం బోల్తా.. బాటిళ్లు ఎత్తుకెళ్లిన స్థానికులు

మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్న వాహనం బోల్తా పడటంతో, స్థానికులు బాటిళ్లు ఎత్తుకెళ్లిన ఘటన తమిళనాడులోని మదురైలో జరిగింది. కేరళలోని మానలూర్ నుంచి పది లక్షల రూపాయల విలువైన మద్యం బాటిళ్లతో ఒక ట్రాలీ వాహనం బుధవారం బయలుదేరింది.

liquor loot: మద్యం వాహనం బోల్తా.. బాటిళ్లు ఎత్తుకెళ్లిన స్థానికులు

Liquor Loot

Updated On : May 11, 2022 / 6:12 PM IST

liquor loot: మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్న వాహనం బోల్తా పడటంతో, స్థానికులు బాటిళ్లు ఎత్తుకెళ్లిన ఘటన తమిళనాడులోని మదురైలో జరిగింది. కేరళలోని మానలూర్ నుంచి పది లక్షల రూపాయల విలువైన మద్యం బాటిళ్లతో ఒక ట్రాలీ వాహనం బుధవారం బయలుదేరింది. అయితే, తమిళనాడులోని విరగనూర్ దగ్గర, మధురై హైవేపై వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో మద్యం బాటిళ్లు మొత్తం రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని, చేతికందిన మద్యం బాటిళ్లను తీసుకుని వెళ్లిపోయారు. ప్రమాదం జరిగిన స్థలం జాతీయ రహదారి కావడంతో, చాలాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.

Madhya Pradesh : పవర్ కట్ తెచ్చిన తంటా..తారుమారైన వధూవరులు

చాలా మద్యం బాటిళ్లు పగిలి, రోడ్డుపై పడ్డాయి. బాగున్న వాటిని స్థానికులు తీసుకెళ్లారు. అయితే, ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, అందరినీ చెదరగొట్టారు. మిగిలిన మద్యం సీసాలను సీజ్ చేశారు. గత నెల 20న కూడా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. బీరు బాటిళ్లు ఉన్న కారు ప్రమాదానికి గురి అవ్వడంతో, స్థానికులు వాటిని ఎత్తుకెళ్లారు.