Madhya Pradesh : పవర్ కట్ తెచ్చిన తంటా..తారుమారైన వధూవరులు

ఓరి ద్యావుడో..పవర్ కట్ ఎంత పని చేసింది. పెళ్లి జరుగుతుండగా కరెంట్ పోయింది. దీంతో జరగకూడని పొరపాటు జరిగిపోయింది. పెళ్లి కొడుకులు పప్పులో కాదు తప్పులో కాలేశారు.ఏకంగా పెళ్లి కూతురు అనుకుని పెళ్లికూతురు చెల్లెలికి తాళి కట్టేశాడు.దీంతో అక్కకు భర్త కావాల్సినవాడు చెల్లెలికి..చెల్లిని చేసుకోవాల్సినవాడు అక్కను చేసుకునేసరికి గందరగోళం అయిపోయింది ఆ పెళ్లి తంతు.

Madhya Pradesh : పవర్ కట్ తెచ్చిన తంటా..తారుమారైన వధూవరులు

Bride Marries Sister's Groom

Bride marries sister’s groom: ఓరి ద్యావుడో..పవర్ కట్ ఎంత పని చేసింది. పెళ్లి జరుగుతుండగా కరెంట్ పోయింది. దీంతో జరగకూడని పొరపాటు జరిగిపోయింది. పెళ్లి కొడుకులు పప్పులో కాదు తప్పులో కాలేశారు.ఏకంగా పెళ్లి కూతురు అనుకుని పెళ్లికూతురు చెల్లెలికి తాళి కట్టేశాడు.దీంతో అక్కకు భర్త కావాల్సినవాడు చెల్లెలికి..చెల్లిని చేసుకోవాల్సినవాడు అక్కను చేసుకునేసరికి గందరగోళం అయిపోయింది ఆ పెళ్లి తంతు. ఇంకేముంది పెళ్లిలో జరిగిన గందగోళానికి వధువుతో పాటు వధువుగా ఉన్న ఆమె చెల్లెలు కూడా షాక్ అయ్యారు. ఇదేదో సినిమాలో కాదు నిజంగానే జరిగింది. ఒకే పందిరి కింద ఒకేసారి కూతుళ్లిద్దరికి వివాహాలు చేద్దామనుకున్న తండ్రితో పాటు వధువులుగా ఉన్న అక్కాచెల్లెళ్లకు దిమ్మ తిరిగిపోయింది.

Also read : ‘Baby Berth’ : తల్లీ పిల్లల కోసం రైల్వేశాఖ వినూత్న సౌకర్యం

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రమేష్‌ లాల్ అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలు నికిత, కరిష్మాలు అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారిద్దరికి ఒకేసారి వివాహం చేద్దామనుకున్నాడు రమేష్ లాల్. అలా వేర్వేరు కుటుంబాలకు చెందిన యువకులతో వివాహం నిశ్చయించాడు. వివాహాలు ముహూర్తం కూడా పెట్టారు. తనకున్నంతలో రమేష్‌ లాల్ వివాహానికి ఏర్పాట్లు చేశాడు. మరికాసేపట్లో వివాహాలు జరుగనున్నాయి. తాను అనుకున్నట్లుగా ఇద్దరు కూతుళ్లకు ఒకేసారి వివాహాలు జరుపుతున్నాననే ఆనందంతో తండ్రి ఉన్నాడు. ఒకే సారి వివాహాలు జరుగుతున్నందుకు అక్కచెల్లెళ్లు ఇద్దరు సంతోషంగా ఉన్నారు.

ఐతే సరిగ్గా పెళ్లితంతు సమయంలో కరెంట్‌ పోయింది. అదీగాక వధువరులు మేలి ముసుగు ధరించి ఉన్నారు. పైగా ఒకేరకమైన పెళ్లి దుస్తులు ధరించడంతో ముహుర్త ఘట్టం వద్దకు వచ్చే వరకు కూడా అక్కడున్న బంధువులెవరికీ ఎవరూ ఎవర్నీ పెళ్లి చేసుకుంటున్నారో అర్థం కాలేదు.

Also read : Sri lanka crisis: ప్రత్యేక హెలికాప్ట‌ర్‌లో వెళ్లి.. నౌకాశ్రయంలో తలదాచుకున్న శ్రీలంక మాజీ ప్రధాని!

అయితే ఇంతలో వివాహతంతు కూడా ముగిసిపోయింది. ఆయా జంటలకు కూడా తమ తమ ఇంటికి చేరుకునేవరకు తాము ఎవర్ని పెళ్లి చేసుకున్నాం అనేది తెలియకపోవడం విచిత్రం. పాపం ఆయా కుటుంబాల వాళ్లు కూడా వధువరులు మారిపోయారనే విషయాన్ని వివాహతంతు ముగిసిపోయే వరకు గుర్తించలేదు. దీంతో కాసేపు ఆయా కుటుంబాల మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. ఐతే ఆయా జంటలు మరోసారి వివాహం జరిపించాలని..ఈసారి ఎవరికి నిర్ణయించిన వధువులతో వారికి వివాహం చేయాలని నిర్ణయించటంతో ఆ గొడవ కాస్త సద్దుమణిగింది.