Sri lanka crisis: ప్రత్యేక హెలికాప్ట‌ర్‌లో వెళ్లి.. నౌకాశ్రయంలో తలదాచుకున్న శ్రీలంక మాజీ ప్రధాని!

శ్రీలంకలో రణరంగాన్ని తలపిస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆ దేశ ప్రజలు ప్రభుత్వం‍పై తిరగబడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ విధించినా లెక్కచేయకుండా దాడులకు దిగారు. ఈ క్రమంలో...

Sri lanka crisis: ప్రత్యేక హెలికాప్ట‌ర్‌లో వెళ్లి.. నౌకాశ్రయంలో తలదాచుకున్న శ్రీలంక మాజీ ప్రధాని!

Srilanka

Sri lanka crisis: శ్రీలంకలో రణరంగాన్ని తలపిస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆ దేశ ప్రజలు ప్రభుత్వం‍పై తిరగబడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ విధించినా లెక్కచేయకుండా దాడులకు దిగారు. ఈ క్రమంలో ప్రభుత్వ మద్దతు దారులు, వ్యతిరేకుల మధ్య ఘర్షణలతో శ్రీలంకలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స పదవుల నుంచి దిగుపోవాలంటూ నెల రోజులుగా నిరసనలు తెలుపుతున్న ప్రజలు సోమవారం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు. పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి తీవ్రస్థాయిలో నిరసనను వ్యక్తం చేశారు. కొలంబోలో అధ్యక్ష కార్యాలయం ఎధుట భారీ ధర్నా నిర్వహించారు.

Sri Lanka crisis: అట్టుడుకుతున్న శ్రీలంక.. ఐదుగురు మృతి, 180మందికి గాయాలు

ఈ నిరసనకారులపై ప్రభుత్వ మద్దతుదారులు దాడులకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ఆందోళన కారులు వాహనాలకు నిప్పు పెట్టారు. ఎంపీలు, అధికార పార్టీ నేతల ఇండ్లను ముట్టడించారు. ఈ ఆందోళన దేశవ్యాప్తంగా విస్తరించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేసిన కొద్దిగంటల్లోనే హంబన్‌టోటాలో రాజపక్సల పూర్వీకుల ఇంటికి నిరసనకారులు నిప్పుపెట్టారు. అంతేకాక ఎంపీల ఇండ్లపై దాడులు చేశారు. వాయువ్య శ్రీలంకలోని నిట్టంబువాలో అధికార పార్టీ ఎంపీ అమరకీర్త కారును అక్కడి ప్రజలు అడ్డగించారు. ఆయన తన రివాల్వర్‌తో కాల్పులకు దిగడంతో ఒక నిరసన కారుడు చనిపోగా మరొకరు గాయపడ్డారు. ఆగ్రహించిన నిరసన‌కారులు వెంబడించడంతో ఎంపీ దగ్గరలోని భవనంలో తలదాచుకున్నారు. స్థానికులు వేలాదిగా భవనాన్ని చుట్టుమట్టి లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో భయాంధోళన చెందిన ఎంపీ రివాల్వర్‌తో తనను తాను కాల్చుకొని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

Sri Lanka Crisis : శ్రీలంక సంక్షోభం-నిరసనకారుల దాడిలో అధికార పార్టీ ఎంపీ మృతి

ఈ క్రమంలో శ్రీలంక మాజీ ప్రధాని రాజపక్స నిరసనకారుల కంటపడకుండా రహస్య ప్రాంతానికి వెళ్లినట్లు వార్తలొచ్చాయి. అయితే త్రికోణమలైలో ఉన్న నావల్ బేస్‌లో ప్రస్తుతం మహింద రాజపక్స ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. మహింద రాజపక్స‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా అక్కడే తలదాచుకుంటున్నారు. రాజధాని కొలంబోకు సుమారు 270 కి.మీ దూరంలో త్రికోణమలై నావల్ బేస్ ఉంది. అయితే ఆందోళన కారులు అక్కడ కూడా ప్రదర్శన చేపట్టారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఫ్యామిలీతో కలిసి మాజీ ప్రధాని రాజపక్స నౌకాశ్రయానికి వెళ్లినట్లు భావిస్తున్నారు.