Sri Lanka crisis: అట్టుడుకుతున్న శ్రీలంక.. ఐదుగురు మృతి, 180మందికి గాయాలు

శ్రీలంక అట్టుడుకుతుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న ఆ దేశంలో ప్రజాగ్రహం పెల్లిబికింది. ప్రజలంతా రోడ్లపైకి వచ్చి తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చుతున్నారు. ఆ దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధికార నివాసం ముందు ..

Sri Lanka crisis: అట్టుడుకుతున్న శ్రీలంక.. ఐదుగురు మృతి, 180మందికి గాయాలు

Srilanka Crisis

Sri Lanka crisis: శ్రీలంక అట్టుడుకుతుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న ఆ దేశంలో ప్రజాగ్రహం పెల్లిబికింది. ప్రజలంతా రోడ్లపైకి వచ్చి తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చుతున్నారు. ఆ దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధికార నివాసం ముందు నిరసన చేస్తున్న వారిపై ప్రధాని మహింద నివాస సమీపంలో ఆయన అనుచరులు దాడికి దిగారు. నిరసన కారుల టెంట్లు, ప్లకార్డులను ధ్వంసం చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించిన లాభం లేకపోయింది. ప్రజాగ్రహం తీవ్రతరం కావడంతో ప్రధాని మహింద రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. రాజపక్సే రాజీనామా చేసిన కొద్దిగంటల్లోనే హంబన్‌టోటాలో రాజపక్సేల పూర్వీకుల ఇంటికి నిరసన కారులు నిప్పు పెట్టారు. అయితే సోమవారం జరిగిన ఆందోళనల్లో ఎంపీ సహా ఐదుగురు మృతి చెందగా, 180 మంది గాయపడ్డారు.

శ్రీలంక ప్రజలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్న క్రమంలో వాయువ్య శ్రీలంకలోని నిట్టంబువాలో అధికార శ్రీలంక పొడుజన పెరమున (ఎల్ఎల్ పీపీ) ఎంపీ అమరకీర్త కారును అడ్డగించారు. ఆయన తన రివాల్వర్ తో కాల్పులకు దిగడంతో ఒక నిరసన కారుడు చనిపోగా మరొకరు గాయపడ్డారు. ఆగ్రహించిన నిరసన కారులు వెంబడించడంతో ఎంపీ దగ్గరలోని భవనంలో తలదాచుకున్నారు. స్థానికులు వేలాదిగా భవనాన్ని చుట్టుమట్టి లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో భయాందళన చెందిన ఎంపీ రివాల్వర్ తో తనను తాను కాల్చుకొని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలాఉంటే ఈ ఘటనలో ఎంపీ భద్రతాధికారి కూడా మృతి చెందాడు. మరోవైపు మరో అధికార పార్టీ నేత వీరకేటియులోని దక్షిణ పట్టణంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా, ఐదుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

SriLanka Economic Crisis Update : కిలో పాలపొడి రూ.2వేలు.. శ్రీలంకలో ఆకలి కేకలు

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఎప్పుడూలేని విధంగా శ్రీలంక అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. నెలల తరబడి ప్రజలు ఆహారం, ఇంధనం, మందుల కొరతను ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసిన రాజపక్స మంగళవారం తెల్లవారు జామున టెంపుల్ ట్రీస్ నుండి బయలుదేరి వెళ్లారు. మహింద రాజపక్సే తన ప్రధాని పదవికి రాజీనామా లేఖను అధ్యక్షుడు గోటబయ రాజపక్సకు అందజేశారు. మహీంద రాజపక్సే రాజీనామాను రాష్ట్రపతి ఆదేశాల మేరకు సోమవారం రాత్రి ప్రచురించిన గెజిట్ అసాధారణ ప్రకటనలో తెలియజేశారు.