‘Baby Berth’ : తల్లీ పిల్లల కోసం రైల్వేశాఖ వినూత్న సౌకర్యం

‘Baby Berth’ : తల్లీ పిల్లల కోసం రైల్వేశాఖ వినూత్న సౌకర్యం

Northern Railway Introduced Baby Berth In Sleeper Class Coaches

Railway Introduced Baby Berth In Sleeper Class Coaches : రైల్వే శాఖ చంటిబిడ్డలున్న తల్లుల కోసం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. రైలులో ప్రయాణించే సమయంలో చంటిబిడ్డలున్న తల్లులకు సీటు ఇబ్బంది లేకుండా చక్కటి నిర్ణయం తీసుకుంది. సీటును ప్రత్యేకంగా రూపొందించింది. ప్రయాణ సమయంలో తల్లులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న రైల్వే శాఖ రైలులో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంట్లో భాగంగానే బేబీ బెర్త్‌లను అందుబాటులోకి తెచ్చింది.

Also read : Work From Office : ఆఫీసుకు వచ్చి పనిచేయమన్న యాపిల్-రాజీనామా చేసిన డైరెక్టర్

నార్తర్న్‌ రైల్వే డివిజన్‌ అధికారులు చంటిపిల్లలు ఉన్న తల్లుల కోసం బేబీ బెర్త్‌లను అందుబాటులోకి తెచ్చారు. ఆ డివిజన్‌కు చెందిన ఇంజనీర్లతో కలిసి లోయర్‌ బెర్త్‌లో కొన్ని అదనపు మార్పులు చేసి బేబీ బెర్త్‌ను రూపొందించారు. ఈ సౌకర్యాన్ని లక్నో మెయిల్‌లో తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ మంచి స్పందన వస్తే ఈ సౌకర్యాన్ని (బేబీ బెర్త్)ఇతర రైళ్లలోకి, ఇతర డివిజన్లలోకి విస్తరించేలా యోచిస్తున్నామని అధికారులు తెలిపారు.

“మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో..లక్నో మెయిల్‌లోని కోచ్ నెం 194129/ B4, బెర్త్ నం 12 & 60లో బేబీ బెర్త్ ప్రవేశపెట్టబడింది. తల్లులు తమ బిడ్డతో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించారు. అమర్చిన బేబీ సీటు కీలులో మడతపెట్టి, స్టాపర్‌తో సురక్షితంగా ఉంటుంది” అని NR యొక్క లక్నో డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) ట్వీట్ చేశారు.

Also read : Bengaluru : చనిపోదామని ఇల్లొదిలిపోయి..మృత్యు ఒడిలో అలా వెళ్లి పడుకున్న 18 ఏళ్ల బాలుడు

భారతీయ రైళ్లలో పెద్ద సంఖ్యలో బాలింతలు, చంటిపిల్లలు ఉన్న తల్లలు ప్రయాణిస్తుంటారు. వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో తల్లిబిడ్డలు ఒకే బెర్త్‌పై పడుకోవాల్సి వస్తోంది. అటువంటి సమయంలో తగినంత చోటు లేకపోవటం ఇబ్బందిపడేవారు. రైళ్లలో ఎన్నో కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా ఈ సమస్యకు ఇన్నాళ్లు పరిష్కరం చూపలేకపోయారు. అయితే తొలిసారిగి నార్నర్‌ రైల్వే ఇంజనీర్లు బేబీ బెర్త్‌ కాన్సెప్టుతో ముందుకు వచ్చారు. ఇటువంటి సౌకర్యం కచ్చితంగా చంటిబిడ్డలున్న తల్లులకు చక్కటి అవకాశం అని చెప్పొచ్చు.