Home » Author »Narender Thiru
మూడు రోజులపాటు జరగనున్న బీజేపీ జాతీయ సదస్సు గురువారం నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రారంభం కానుంది. బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సదస్సును ఘనంగా నిర్వహిస్తున్నారు.
అనేక అంశాల్లో ఇండియాలోనూ శ్రీలంక వంటి పరిస్థితే ఉందని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజల దృష్టి మళ్లించడం ద్వారా ప్రభుత్వం తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం నడిరోడ్డుపై నిలిచిపోయింది. బుధవారం షాద్ నగర్ వెళ్లి వస్తుండగా, మార్గమధ్యలో వాహనం నిలిచిపోయింది.
త్వరలో రాజ్యసభకు జరగనున్న ఎన్నికలకు అభ్యర్థులను టీఆర్ఎస్ పార్టీ బుధవారం ప్రకటించింది. మూడు స్థానాలకుగాను అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.
పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తర ప్రదేశ్‌లోని, ఉన్నావ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఉన్నావ్ పట్టణంలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు.
కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. మంగళవారం రాత్రి నుంచి తెల్లవారుఝాము వరకు కురిసిన భారీ వర్షం కారణంగా నగరం మొత్తం జలమయమైంది. అనేక ప్రాంతాల్లో కనీసం 3-4 అడుగుల ఎత్తు వరకు నీరు నిలిచిపోయింది.
తమిళనాడులోని సేలం జిల్లాలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో దాదాపు 30 మందికి గాయాలయ్యాయి. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
బీజేపీ అనుసరిస్తున్న వైఖరితో దేశంలోని పర్యాటక ప్రదేశాలు నష్టపోతున్నాయని విమర్శించారు జమ్ము-కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ.
ఉత్తర ప్రదేశ్, వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో జరుగుతున్న సర్వే అంశం కొత్త మలుపు తిరిగింది. తాజా సర్వేలో శివలింగం కనిపించినట్లు సర్వేను పర్యవేక్షిస్తున్న లాయర్ ప్రకటించారు.
ఇటీవల సంచలనం సృష్టించిన బ్యాంక్ ఆఫ్ బరోడా చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. డబ్బు తీసుకుని పారిపోయాడని ఆరోపణలొచ్చిన క్యాషియర్ ప్రవీణ్, కోర్టులో సోమవారం లొంగిపోయాడు.
ఢిల్లీలో బీజేపీ చేపట్టిన కూల్చివేతలపై, ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విమర్శలు చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల పేరుతో ప్రజల ఇండ్లు, షాపులను ప్రభుత్వం కూల్చివేస్తోందని, ఇది సరికాదని విమర్శించారు.
శ్రీలంకలో మాజీ ప్రధాని రాజపక్సేకు పట్టిన గతే, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కూడా పట్టబోతుందని, ఈ విషయం జగన్‌కు కూడా అర్థమైందని విమర్శించారు టీడీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న.
విశాఖ శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి సోమవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. పౌర్ణమి రోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.
హైదరాబాద్, నాగోల్‌లోని స్విమ్మింగ్‌పూల్‌లో పడి పదేళ్ల బాలుడు ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే. తమ కుమారుడి మృతికి బాధ్యులైన స్విమ్మింగ్‌పూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేస్తున్�
టీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలో లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్ రానుంది. ఇప్పుడు ఈ ఫీచర్‌ను డెవలప్ చేసే పనిలో ఉంది నెట్‌ఫ్లిక్స్. టాలెంట్ షోస్ కూడా లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది నెట్‌ఫ్లిక్స్.
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నాలుగు వారాలుగా పెరుగుతూ వచ్చిన కరోనా కేసుల సంఖ్య, గతవారం దాదాపు 20 శాతం తగ్గింది.
జిల్లా అధికారులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన సైన్యం, ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా రక్షణ చర్యలు చేపట్టింది. రైలులో చిక్కుకున్న 119 మంది ప్రయాణికుల్ని హెలికాప్టర్లలో సురక్షితంగా తరలించింది.
భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయనే సూచనతో కేరళలో హై అలర్ట్ ప్రకటించారు. దాదాపు ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) ప్రకటించింది.
స్మార్ట్‌ఫోన్ పక్కనబెట్టి, చదువుకోమని తల్లిదండ్రులు చెప్పినందుకు బాలుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మహారాష్ట్రలోని కండివలిలో జరిగింది.
రైతు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన రాకేష్ టికాయత్‌ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ). కొంతకాలంగా జరుగుతున్న రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతల్లో రాకేష్ టికాయత్ ఒకరు.