bank of baroda: బ్యాంకు చోరీ కేసులో ట్విస్ట్.. లొంగిపోయిన క్యాషియర్

ఇటీవల సంచలనం సృష్టించిన బ్యాంక్ ఆఫ్ బరోడా చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. డబ్బు తీసుకుని పారిపోయాడని ఆరోపణలొచ్చిన క్యాషియర్ ప్రవీణ్, కోర్టులో సోమవారం లొంగిపోయాడు.

bank of baroda: బ్యాంకు చోరీ కేసులో ట్విస్ట్.. లొంగిపోయిన క్యాషియర్

Bank Of Baroda

Updated On : May 16, 2022 / 2:18 PM IST

bank of baroda: ఇటీవల సంచలనం సృష్టించిన బ్యాంక్ ఆఫ్ బరోడా చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. డబ్బు తీసుకుని పారిపోయాడని ఆరోపణలొచ్చిన క్యాషియర్ ప్రవీణ్, కోర్టులో సోమవారం లొంగిపోయాడు. వారం రోజుల క్రితం వనస్థలిపురం, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌ నుంచి రూ.22 లక్షలు కనిపించకుండా పోయాయి. బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్, డబ్బు తీసుకుని పారిపోయాడని ఆరోపణలు వచ్చాయి. అప్పట్నుంచి కనిపించకుండా పోయిన ప్రవీణ్.. సెల్ఫీ వీడియోలు పంపిస్తూ వచ్చాడు.

Hyderabad : మహిళపై దాడి ముగ్గురు యువతులు అరెస్ట్

డబ్బులు తాను తీసుకోలేదని, బ్యాంకు మేనేజర్‌తోపాటు ఇతర అధికారులే డబ్బు తీసుంటారని ప్రత్యారోపణలు చేశాడు. తాను వారణాసిలో ఉన్నానంటూ పోలీసులను తప్పుదోవ పట్టించాడు. అయితే, ఇన్‌స్టా చాట్ ఆధారంగా ప్రవీణ్ గోవాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా పోలీసులకు చిక్కకుండా నేరుగా హయత్ నగర్ కోర్టులో లొంగిపోయాడు.