Home » Author »Narender Thiru
ఏపీలో జనసేన పార్టీ సమావేశం జరుగుతుండా కరెంటు పోయింది. శుక్రవారం రాత్రి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో దారుణం జరిగింది. శుక్రవారం సాయంత్రం షాహినాథ్ గంజ్ పరిధిలోని మచ్చి మార్కెట్ వద్ద పరువు హత్య జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్నారన్న కారణంతో నలుగురు దుండగులు యువకుడిని కత్తితో పొడిచి హత్య చేశారు.
క్యాబ్ వినియోగదారులు నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. క్యాబ్ నిర్వహణా సంస్థలైన ఓలా, ఉబర్, మేరు, ర్యాపిడో, జుగ్ను వంటి సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
త్వరలో దేశంలో డ్రోన్లతో ఔషధాల సరఫరా జరగనుంది. ముఖ్యంగా వైద్య సేవలు సరిగ్గా అందని గ్రామీణ ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేయవచ్చని ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)’ అభిప్రాయపడింది.
దేశంలోకి గత ఏడాది భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను, 83.57 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర వాణిజ్య శాఖ శుక్రవారం ప్రకటించింది.
మూడేళ్ల నుంచి నిలిచిపోయిన జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు త్వరలో మొదలుకానున్నాయి. మళ్లీ విమానాలు నడుపుకొనేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతించింది.
యూపీ పోలీసులు తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఒక జింక రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుంటుంది. అయితే, రోడ్డుపై కార్లు వెళ్తుండటంతో కాస్సేపు ఆగుతుంది. తర్వాత వాహనాలు ఆగిన తర్వాత నెమ్మదిగా జీబ్రా క్రాసింగ్‌పై నడుచుకుంటూ వెళ్తుంది.
ఈ నెల 3న ఛార్‌ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 48 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 46 మంది గుండెపోటుతోనే మరణించారు.
జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది.
పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన షీ టీమ్స్‌కు భారీ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. గత జనవరి నుంచి ఏప్రిల్ వరకు 423 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ పనిచేయడం లేదని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తు చేసుకుందామని ప్రయత్నిస్తుంటే, వెబ్సైట్ సరిగ్గా పనిచేయడం లేదంటున్నారు.
సిగ్నలింగ్ కేబుల్‌ను దొంగలు ఎత్తుకెళ్లడంతో ఢిల్లీ మెట్రో రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. సిగ్నలింగ్ వ్యవస్థను సపోర్ట్ చేసే కేబుల్‌లోని కొంతభాగాన్ని దొంగలు ఎత్తుకెళ్�
జపాన్ రాజధాని టోక్యోలో ఈనెల 24న జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.
దేశంలోని సెక్స్ వర్కర్లకు కూడా ఆధార్ కార్డులు జారీ చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతి ఒక్కరికి సమానంగా, గౌరవంగా బతికే హక్కు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.
చెన్నై బీచ్‌లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. చెన్నైలోని బీచ్‌లలో ప్రముఖమైంది మెరీనా బీచ్. ఇక్కడికి ఎక్కువ మంది టూరిస్టులు వస్తుంటారు.
పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 1988లో జరిగిన ఒక ఘటనకు సంబంధించి గురువారం ఈ తీర్పు వెలువరించింది.
మందుబాబులకు షాకిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రేపటి నుంచి మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19, గురువారం నుంచి పెరిగిన మద్యం ధరలు అమలవుతాయని ప్రభుత్వం ప్రకటించింది.
అసోం రాష్ట్రాన్ని కొన్ని రోజులుగా వరదలు ముంచెత్తాయి. వరదల ప్రభావానికి రాష్ట్రంలో ఎనిమిది మంది మరణించారు. మొత్తం ఐదు లక్షల మందికి పైగా అసోం వాసులు వరద ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం ప్రకటించింది.
ఉత్తరాఖండ్‌లో ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా ఉన్న అజయ్ కొతియాల్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు పంపారు.
నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో సోమవారం అంటుకున్న కార్చిచ్చు, క్రమంగా భారత భూభాగంలోని మెందార్ సెక్టార్‌లోకి చొచ్చుకు వచ్చింది.