Jet Airways: మూడేళ్ల తర్వాత ఎగరనున్న జెట్ ఎయిర్‌వేస్ విమానాలు

మూడేళ్ల నుంచి నిలిచిపోయిన జెట్ ఎయిర్‌వేస్ విమాన సర్వీసులు త్వరలో మొదలుకానున్నాయి. మళ్లీ విమానాలు నడుపుకొనేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతించింది.

Jet Airways: మూడేళ్ల తర్వాత ఎగరనున్న జెట్ ఎయిర్‌వేస్ విమానాలు

Jet Airways

Updated On : May 20, 2022 / 7:12 PM IST

Jet Airways: మూడేళ్ల నుంచి నిలిచిపోయిన జెట్ ఎయిర్‌వేస్ విమాన సర్వీసులు త్వరలో మొదలుకానున్నాయి. మళ్లీ విమానాలు నడుపుకొనేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా విమానయాన సంస్థకు ఈ నెల మొదటివారంలో భద్రతాపరమైన అనుమతులు కూడా మంజూరు చేసింది.

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. అమరరాజాపై చర్యలపై స్టే

దీంతో వచ్చే సెప్టెంబర్ నుంచి జెట్ ఎయిర్‌వేస్ విమాన సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జెట్ ఎయిర్‌వేస్ సంస్థను నరేష్ గోయల్ కొనుగోలు చేశారు. అయితే, ఆ తర్వాత ఆర్థిక నష్టాలు, అప్పుల మూలంగా సంస్థ నిర్వహణ కష్టమైంది. సిబ్బందికి వేతనాలు చెల్లించేందుకు, నిర్వహణ కోసం కూడా నిధులు లేని పరిస్థితి. దీంతో 2019, ఏప్రిల్ 17 నుంచి జెట్ ఎయిర్‌వేస్ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీని కారణంగా దాదాపు 20,000 మంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. అప్పట్నుంచి సంస్థ నిధుల కోసం ప్రయత్నిస్తూనే ఉంది. గత జూన్‌లో బ్రిటన్, యూఏఈకి చెందిన సంస్థలు నిధులు సమకూర్చేందుకు ముందుకొచ్చాయి.

North Korea: నార్త్‌ కొరియాలో కరోనా విలయం.. కషాయాలు, టీలు తాగండి అంటూ సలహా

అప్పల్ని కూడా తీరుస్తామని హామీ ఇచ్చాయి. ఈ విషయంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో అంగీకరించిన కేంద్రం విమానాలు తిరిగి నడిపేందుకు అనుమతించింది. ఇప్పటికే ఈ సంస్థ వివిధ విభాగాల కోసం దాదాపు 200 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకుంది.