Modi: టోక్యోలో బైడెన్‌తో భేటీ కానున్న మోదీ

జపాన్ రాజధాని టోక్యోలో ఈనెల 24న జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.

Modi: టోక్యోలో బైడెన్‌తో భేటీ కానున్న మోదీ

Modi

Updated On : May 19, 2022 / 7:59 PM IST

Modi: జపాన్ రాజధాని టోక్యోలో ఈనెల 24న జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఇది నాలుగవ క్వాడ్ సదస్సు. ఈ సదస్సు సందర్భంగా జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిడాతో మోదీ సమావేశమవుతారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో కూడా సమావేశమవుతారు. పర్యటనలో భాగంగా జపాన్‌లో ఉన్న భారతీయులను మోదీ కలుసుకుంటారు.

Modi Telangana Tour : రాజకీయ ఆసక్తి రేపుతున్న ప్రధాని మోదీ తెలంగాణ టూర్

భారతీయులను ఉద్దేశించి ప్రత్యేక ప్రసంగం చేస్తారు. తర్వాత జపాన్ వ్యాపారవేత్తలతో మోదీ చర్చలు జరుపుతారు. భారత్‌లో ఉన్న వ్యాపార అవకాశాల గురించి వివరించి, పెట్టుబడులను ఆకర్షిస్తారు. క్వాడ్ దేశాలకు సంబంధించి అభివృద్ధి, పరస్పర సహకారం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని సమస్యలపై చర్చించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.