Buses Collide: రెండు బస్సులు ఢీ.. సీసీ టీవీలో రికార్డైన ప్రమాద దృశ్యాలు

తమిళనాడులోని సేలం జిల్లాలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో దాదాపు 30 మందికి గాయాలయ్యాయి. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

Buses Collide: రెండు బస్సులు ఢీ.. సీసీ టీవీలో రికార్డైన ప్రమాద దృశ్యాలు

Buses Collide

Updated On : May 18, 2022 / 3:46 PM IST

Buses Collide: తమిళనాడులోని సేలం జిల్లాలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో దాదాపు 30 మందికి గాయాలయ్యాయి. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎడప్పాడి, తిరుచెంగోడ్‌ నుంచి బయలు దేరిన రెండు ప్రైవేటు బస్సులు రహదారిపై ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ముప్పై మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బస్సులో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వీడియో ప్రకారం.. బస్సు వేగంగా వెళ్తుండగా, ఎదురుగా ఉన్న మరో బస్సును ఢీకొంది. క్షణిక కాలంలో ఈ ఘటన జరిగిపోయింది. బస్సు ఢీకొనడంతో సీట్లో ఉన్న డ్రైవర్ పక్కకు ఎగిరిపడ్డాడు.

 

బస్సు ముందు భాగం ధ్వంసమైంది. తర్వాత నెమ్మదిగా డ్రైవర్ లేచిన దృశ్యం కూడా వీడియోలో కనిపిస్తోంది. గాయాలపాలైన ప్రయాణికులను అధికారులు సేలం, ఎడప్పాడ్ ఆసుపత్రులకు చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.