School bus: ట్రక్కును ఢీకొన్న స్కూల్ బస్సు, 12 మంది చిన్నారులకు గాయాలు

హరియాణాలోని సోనిపట్ సమీపంలో జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో 12 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. చంఢీఘడ్-ఢిల్లీ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

School bus: ట్రక్కును ఢీకొన్న స్కూల్ బస్సు, 12 మంది చిన్నారులకు గాయాలు

School Bus

Updated On : May 13, 2022 / 4:23 PM IST

School bus: హరియాణాలోని సోనిపట్ సమీపంలో జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో 12 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. చంఢీఘడ్-ఢిల్లీ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక రుక్మణి స్కూల్ బస్సు 30 మంది విద్యార్థులతో స్కూల్ గేటులోకి ఎంటరయ్యేందుకు రాంగ్ రూట్‌లో వచ్చింది. అయితే, అదే రూట్‌లో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. దీంతో స్కూల్ బస్సు డ్రైవర్‌తోపాటు 12 మంది చిన్నారులకు గాయాలయ్యాయి.

 

త్వరగా వెళ్లొచ్చన్న ఉద్దేశంతో బస్సు డ్రైవర్, రాంగ్ రూట్‌లో వెళ్లేందుకు ప్రయత్నించడమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఆరుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.