కోల్ కతా నైట్ రైడర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం

  • Published By: bheemraj ,Published On : October 30, 2020 / 01:03 AM IST
కోల్ కతా నైట్ రైడర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం

Chennai Super Kings win : ఐపీఎల్-13 వ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో కేకేఆర్ పై చెన్నై సూపర్ కింగ్స్ గెలుపొందింది. కోల్ కతా నైట్ రైడర్స్ 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ఐపీఎల్‌-13వ సీజన్‌లో కేకేఆర్ 5వ విజయాన్ని నమోదు చేసింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు. ఆఖర్లో జడేజా సిక్సర్లతో హోరెత్తించడంతో కేకేఆర్‌పై విజయం సాధించింది.

ఓపెనర్‌ వాట్సన్‌ 14 పరుగులకే వెనుదిరిగినా రాయుడు అండతో రుతురాజ్‌ రన్‌రేట్‌ పడిపోకుండా బ్యాటింగ్‌ కొనసాగించాడు. ఈ క్రమంలోనే 37 బంతుల్లో రుతురాజ్‌ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరి భాగస్వామ్యం బలపడుతున్న వేళ 38 పరుగులు చేసిన రాయుడుని కమిన్స్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్‌ ధోని కేవలం ఒక్క పరుగు చేసి వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సామ్‌ కరాన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించిన గైక్వాడ్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. చివర్లో జడేజా 10 బంతుల్లో 31 పరుగులు(2ఫోర్లు, 3సిక్స్‌లతో) రెచ్చిపోవడంతో ఆఖరి బంతికి చెన్నై విజయాన్ని నమోదు చేసింది. కాగా కేకేఆర్ ఈ ఓటమితో ప్లేఆఫ్‌ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది.

అంతకముందు టాస్‌ గెలిచిన చెన్నై కోల్ కతా నైట్ రైడర్స్ ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు శుభమన్‌ గిల్‌, నితీష్‌ రాణాలు ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించారు. పవర్‌ ప్లే ముగిసే సమయానికి కేకేఆర్‌ 6 ఓవర్లలో 48 పరుగులు చేసింది. 26 పరుగులు చేసిన గిల్‌ జట్టు స్కోరు 53 పరుగుల వద్ద ఉన్నప్పుడు కర్ణ్‌ శర్మ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. తర్వాత వచ్చిన సునీల్‌ నరైన్‌ వచ్చీ రాగానే భారీ సిక్స్‌ కొట్టినా ఎక్కువసేపు
క్రీజులో నిలవలేదు. కాసేపటికే రింకూ సింగ్‌ కూడా ఔట్ అవ్వడంతో కేకేఆర్‌ 99 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

మరో ఓపెనర్‌ నితీష్‌ రాణా 44 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. అయితే కర్ణ్‌ శర్మ వేసిన 16వ ఓవర్లో నితీష్‌ రాణా హ్యాట్రిక్‌ సిక్సర్లతో మొత్తం 19 పరుగులు చేయడంతో కోల్ కతా నైట్ రైడర్స్ స్కోరు ఒక్కసారిగా మారిపోయింది. దీపక్‌ చాహర్‌ వేసిన 17వ ఓవర్లో రెండు ఫోర్లతో విరుచుకుపడిన రాణా.. 87 పరుగుల వద్ద ఎన్గిడి బౌలింగ్‌లో క్యాచ్‌ అవుట్‌ ఔట్ అయ్యాడు. ఇక చివర్లో దినేష్‌ కార్తీక్‌ 10 బంతుల్లోనే 21 పరుగులు చేయడంతో కేకేఆర్‌ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ఎన్గిడి 2, సాంట్నర్‌, కర్ణ్‌ శర్మ, జడేజా ఒక్కొో వికెట్‌ చొప్పున తీశారు.