కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే ‘ఇమ్యూనిటీ పాస్‌పోర్టు’ ఐడీలు.. ఇక ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లొచ్చా?

  • Published By: sreehari ,Published On : December 8, 2020 / 05:23 PM IST
కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే ‘ఇమ్యూనిటీ పాస్‌పోర్టు’ ఐడీలు.. ఇక ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లొచ్చా?

Covid ID cards after get vaccinated : కరోనావైరస్ అంతమైనట్టే.. బ్రిటన్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. సాధారణ ప్రజలకు కరోనా టీకాను అందిస్తున్నారు. మొదటగా 50 యూకే వ్యాక్సిన్ సెంటర్లలో వ్యాక్సిషన్ అందించినట్టు NHS ఒక ప్రకటనలో వెల్లడించింది. కరోనా వచ్చినవారికి ముద్ర వేసేవారు.. ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్నవారికి గుర్తుగా ఐడీ కార్డులను అందిస్తున్నారు. క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉండే బ్యాడ్జీలను అందిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రతి బ్రిటన్ వాసికి కరోనా ఐడీ కార్డు అందిస్తారు.



ఆ ఐడీ కార్డులపై ఏ రకం వ్యాక్సిన్ ఇచ్చారు.. బ్యాచ్ నెంబర్ ఏంటి? ఏ తేదీలో వ్యాక్సిన్ ఇచ్చారో ఆయా వివరాలు ఉంటాయి. రెండో డోస్ ఎప్పుడు ఇస్తారు? అపాయింట్ మెంట్ డేట్ కూడా కార్డుపై పొందుపరిచి ఉంటుంది. అంతేకాదు.. ఒకసారి కరోనా టీకా పొందిన తర్వాత, వ్యాక్సిన్ వివరాలతో పాటు వారి వ్యక్తిగత వివరాలను NHS డేటాబేస్‌లో నమోదు చేస్తారు.
Covid Vaccines People

అయితే ఈ కొత్త Covid Cards తప్పనిసరిగా ఉండాలా? లేదా ఇమ్యూనిటీ పాస్ట్ పోర్టులా వాడొచ్చా అనేది స్పష్టత లేదు. క్రెడిట్ కార్డు సైజులో ఉండే ఈ కోవిడ్ ఐడీ కార్డులతో రెండో మోతాదు టీకా కోసం గుర్తుండేందుకు ఇవ్వడం జరుగుతోందని Welsh ఆరోగ్య శాఖ మంత్రి Vaughan Gething తెలిపారు. ఏ రకం వ్యాక్సిన్ వేయించుకున్నారో రెండో మోతాదు సమయంలో గుర్తించేందుకు వీలుగా టీకా వేసినవారికి ఈ తరహా కొత్త కోవిడ్ ఐడీ కార్డులు ఉపయోగపడతాయని ఆయన చెప్పారు.



అంతేకాదు.. మొదటి మోతాదు టీకా వేయించుకున్నవారిలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో సులభంగా గుర్తించవచ్చునని అన్నారు. ఈ కరోనా ఐడీ కార్డులను ఇమ్యూనిటీ పాసుపోర్టులుగా వాడుకోవచ్చుని, ప్రపంచంలో ఎక్కడైనా వెళ్లొచ్చుననే సలహాలు, సూచనలను కేబినెట్ ఆఫీసు మినిస్టర్ మిచెల్ గోవ్ ఖండించారు. ఎలాంటి వ్యాక్సిన్ పాస్టుపోర్టులను తమ ప్రభుత్వం ప్రవేశపెట్టడం లేదని స్పష్టం చేశారు.

సినిమా వంటి ఎంటరైన్మెంట్ వేదికలతో పాటు రెస్టారెంట్లు, బార్లలో వ్యాక్సినేషన్ సిస్టమ్ ప్రవేశపెట్టబోతున్నట్టు తెలిపారు. ఈ వ్యవస్థను రెస్టారెంట్లు, బార్లు, సినిమా థియేటర్లు, క్రీడా వేదికల్లోనూ అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. సౌత్ లండన్‌లోని క్రోయడాన్ యూనివర్శిటీ ఆస్పత్రిలో యూకేలో మొదటి ఫైజర్ వ్యాక్సిన్ కోల్డ్ స్టోర్ ను ఏర్పాటు చేశారు.



రాబోయే వారాలు.. నెలల్లో ఈ వ్యాక్సిన్ అన్ని ఆస్పత్రులకు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా 80ఏళ్లు పైబడినవారితో పాటు కేర్ హోం వర్కర్లు, NHS సిబ్బందికి మొదటి ఫైజర్ వ్యాక్సిన్ డోస్ ఇస్తున్నామని తెలిపారు. మరోవైపు కరోనా వ్యాక్సిన్ ఐడీ కార్డులను చూపించకపోతే.. షాపులు, సర్వీసులను యాక్సస్ చేసుకోలేమని ఆందోళన నెలకొంది.