అమెరికా అధ్యక్షుడు బైడెన్..!

  • Published By: sreehari ,Published On : November 7, 2020 / 07:11 AM IST
అమెరికా అధ్యక్షుడు బైడెన్..!

Joe Biden Becoming US President : అమెరికా అధ్యక్ష పదవి రేసులో జో బైడెన్‌ (77) దూసుకెళ్తున్నారు. బైడెన్ గెలుపు లాంఛనం కానుంది. హోరాహోరీ పోరులో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ను బలమైన ప్రత్యర్థిగా నిలిచారు బైడెన్.. ట్రంప్‌కు అత్యంత కీలకమైన జార్జియా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఫలితాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాలను బట్టి బైడెన్‌ది పైచేయిగా ఉంది.



జార్జియాలో 50 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్న ట్రంప్‌ ను దాటేసి బైడెన్ ముందంజలో దూసుకుపోయారు.

బైడెన్‌ 1,579 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. పెన్సిల్వేనియాలో ట్రంప్‌ కంటే బైడెన్‌ 5,587 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
https://10tv.in/us-election-2020-who-has-lead-in-states-still-counting/
నెవడాల్లోనూ బైడెన్‌ హవానే కొనసాగుతోంది. ప్రస్తుత ఫలితాలను చూస్తే బైడెన్‌కు 264 ఎలక్టోరల్‌ ఓట్లు, ట్రంప్‌కు 214 ఓట్లు వచ్చాయి.



మొత్తం 538 ఎలక్టోరల్‌ ఓట్లకుగాను 270 ఓట్లు సాధించిన వారికే అధ్యక్ష పీఠం వరించనుంది.

జార్జియా, పెన్సిల్వేనియాల్లో ఓటమి పాలైతే మళ్లీ ఎన్నికయ్యేందుకు ట్రంప్‌కు దారులు మూసుకుపోయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.



2016 ఎన్నికలతో పోలిస్తే ఈసారి అధ్యక్ష అభ్యర్థి బైడెన్‌కు 41 లక్షల ఓట్లు.. అంటే 1.3 శాతం ఓట్లు అధికంగా పడ్డాయి.

కాలిఫోర్నియా, న్యూయార్క్‌ వంటి రాష్ట్రాల్లో ఇంకా 60 లక్షల ఓట్లను లెక్కించాల్సి ఉంది. బైడెన్‌ ఆధిక్యం మరింతగా పెరిగేందుకు అవకాశాలున్నాయని అంచనా.

బైడెన్‌కు సీక్రెట్ సెక్యూరిటీ :
ప్రస్తుత పరిణామాలను అంచనా వేసిన అమెరికా నిఘా విభాగం అధికారుల బృందాలు జో బైడెన్‌కు రక్షణ కల్పించేందుకు విల్మింగ్టన్, డెలావర్‌కు తరలివెళ్లినట్లు సమాచారం.US President

అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందే వారికి అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ భారీగా భద్రత కల్పిస్తుంది. కాబోయే అధ్యక్షుడికి విమాన ప్రయాణాల సమయాల్లో ఇలానే రక్షణ కల్పిస్తుంటుంది.



బైడెన్‌ వాహన కాన్వాయ్‌కి భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. పెన్సిల్వేనియా, మిషిగన్, జార్జియా, నెవడాల్లో పోలింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ ట్రంప్‌ అనుచరులు కోర్టుల్లో కేసులు వేశారు. ఈ ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్‌ జరిగింది.



గత 120 ఏళ్ల రికార్డులన్నీ తిరగరాసేలా ఓటర్లు తమ ఓటు హక్కు విని యోగించుకున్నట్టు అమెరికా ఎలక్షన్‌ ప్రాజెక్టు పేర్కొంది. ఈసారి ఎన్నికల్లో 23.9 కోట్ల మందికి ఓటు హక్కు ఉంది.

వారిలో 16 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1900 ఎన్నికల తర్వాత ఈ స్థాయిలో ఓటర్లు తమ హక్కుని విని యోగించుకోవడం ఇదే తొలిసారి.

పెద్దన్నల మధ్య స్వల్ప ఓట్ల తేడా :
ట్రంప్, బైడెన్‌ల మధ్య ఓట్ల తేడా స్వల్పంగా ఉండటంతో జార్జియాలో రీకౌంటింగ్‌ నిర్వహించనున్నారు. బైడెన్‌కు 1,579 ఓట్ల స్వల్ప మెజారిటీ లభించింది. దాంతో ఇద్దరు అభ్యర్థులకు తలో 49.4 శాతం ఓట్లు పడ్డాయి.

మరో 4,169 ఓట్లను లెక్కించాల్సి ఉంది. జార్జియా చట్టాల ప్రకారం.. ఇద్దరు అభ్యర్థుల ఓట్లలో 0.5 శాతం ఓట్ల తేడా ఉంటే రీకౌంటింగ్‌ జరపొచ్చు.



రిపబ్లికన్‌ పార్టీ కంచుకోటగా ఉన్న జార్జియాలో సైనిక సిబ్బంది, ఇతరుల ఓట్లు మరో 9వేలు రావాల్సి ఉంది.

అదేవిధంగా, పెన్సిల్వేనియాలో ట్రంప్‌ కంటే బైడెన్‌ 5,587 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బుధవారం వరకు ట్రంప్‌ 70 వేల పైచిలుకు ఓట్లతో ముందంజలో ఉండటం గమనార్హం.



నెవడాల్లోనూ బైడెన్‌ హవానే కొనసాగుతోంది. ప్రస్తుత ఫలితాలను బట్టి బైడెన్‌కు 264 ఎలక్టోరల్‌ ఓట్లు, ట్రంప్‌కు 214 ఓట్లు వచ్చాయి.

మొత్తం 538 ఎలక్టోరల్‌ ఓట్లకు గాను 270 ఓట్లు సాధించిన వారికే అధ్యక్ష పీఠం దక్కనుంది.