సందేహం లేదు…కమలతో కలిసి విజేతలను ప్రకటిస్తా : బైడెన్

  • Published By: venkaiahnaidu ,Published On : November 6, 2020 / 08:39 AM IST
సందేహం లేదు…కమలతో కలిసి విజేతలను ప్రకటిస్తా : బైడెన్

‘No doubt’ we will be declared winners: Joe Biden అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఎవ్వరికీ అనుమానం వద్దని..విజయం తమదేనని డెమొక్రాట్ అభ్య‌ర్థి జో బైడెన్ విశ్వాసం వ్య‌క్తంచేశారు. ఓట్ల లెక్కింపు పూర్త‌యితే నిస్సందేహంగా త‌మ‌నే విజేత‌లుగా ప్ర‌క‌టిస్తార‌ని స్ప‌ష్టం చేశారు. విల్మింగ్ టన్ నుంచి మాట్లాడిన జో బైడెన్…ప్ర‌స్తుతం వెలువ‌డిన ఫ‌లితాల‌ను బ‌ట్టి ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థి క‌మ‌లా హారీస్‌, తాను సంతృత్తిగా ఉన్నామ‌ని వెల్ల‌డించారు.



కౌంటింగ్ ముగిసిన త‌ర్వాత త‌మ‌నే విజ‌యం వ‌రిస్తుంద‌నే విష‌యంలో ఎలాంటి సందేహం లేద‌న్నారు బైడెన్. అందువ‌ల్ల త‌మ మ‌ద్ద‌తుదారులు ప్ర‌శాంతంగా ఉండాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఫ‌లితాకోసం ఓపిక‌గా ఎదురుచూస్తున్న‌వారంద‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ద‌ని, త్వ‌ర‌లోనే ముగుస్తుంద‌న్నారు. వీలైనంత తొంద‌ర‌గా ఫ‌లితాలు వెల్ల‌డ‌వుతాయ‌న్నారు. కాబోయే అధ్య‌క్షుణ్ని తేల్చాలంటే ప్ర‌తి ఒక్క ఓటును త‌ప్ప‌నిస‌రిగా లెక్కించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు.



https://10tv.in/keep-the-faith-guys-we-are-going-to-win-this-joe-biden/
ఇక,అమెరికా అధ్యక్షుడిగా బైడెన్​ విజయం దాదాపు ఖరారైనట్లే. అందరూ భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలంటే 538 సభ్యులున్న ఎలక్టోరల్‌ కాలేజీలో 270 ఓట్లు కావాలి. ప్రస్తుతం డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించి మ్యాజిక్‌ ఫిగర్ ‌కు అత్యంత చేరువలో ఉన్నారు. ఇక ట్రంప్‌కు 214 ఓట్లు వచ్చాయి.