ప్లాస్టిక్ ఫేస్ షీల్డ్‌లు కరోనా నుంచి కాపాడలేవు.. వైరస్ ఇలానే ఎక్కువ వ్యాపిస్తోంది.. షాకింగ్ వీడియో!

  • Published By: sreehari ,Published On : December 9, 2020 / 04:41 PM IST
ప్లాస్టిక్ ఫేస్ షీల్డ్‌లు కరోనా నుంచి కాపాడలేవు.. వైరస్ ఇలానే ఎక్కువ వ్యాపిస్తోంది.. షాకింగ్ వీడియో!

plastic face shields : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని అంతం చేయాలంటే వ్యాక్సిన్ రావాల్సిందే.. ఆ వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో కచ్చితంగా చెప్పలేం.. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాప్తిని నియంత్రించాలంటే.. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌లు, ఫేస్ షీల్డ్‌లు, భౌతిక దూరం తప్పక పాటించాల్సిన అవసరం ఉంది. అయితే ఫేస్ మాస్క్, ఫేస్ షీల్డ్ ధరించాం కదా? కరోనా వైరస్ రాదులే అంటే పొరపాటే.. ప్లాస్టిక్ ఫేస్ షీల్డ్ ధరించినప్పటికీ కూడా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.



ముఖ్యంగా ప్లాస్టిక్ ఫేస్ షీల్డ్ ధరించినవారిలోనే కరోనా వ్యాప్తి అధికంగా ఉందంట.. ప్లాస్టిక్ ఫేస్ షీల్డ్ లు కరోనా నుంచి మన్నల్ని కాపాడలేమంటోంది కొత్త అధ్యయనం.. మూడు అడుగుల భౌతిక దూరం పాటించిన వ్యక్తి.. ప్లాస్టిక్ ఫేస్ షీల్డ్ ధరించినప్పటికీ కూడా కరోనా వ్యాప్తి అవుతుందని అధ్యయనంలో రుజువైంది.
plastic face shields

కరోనా సోకిన వ్యక్తి తుమ్మినా లేదా దగ్గినా వారి నుంచి విడుదలయ్యే వైరస్ తుంపర్లు నేరుగా ఫేస్ షీల్డ్ పై నుంచి లేదా కిందిభాగం నుంచి లోపలికి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు అధ్యయన పరిశోధకులు..



సాధారణంగా హెయిర్ డ్రెసర్లు, బార్బర్లు, నెయిల్ టెక్నిషియన్లు, టాటూయిస్టులు ప్లాస్టిక్ ఫేస్ షీల్డ్స్ ధరించి తమ కస్టమర్లకు సర్వీసు అందిస్తుంటారు. మొదటి లాక్ డౌన్ నుంచి ఇదే తరహాలో తమ సర్వీసులను అందిస్తున్నారు. కానీ, ఈ ఫేస్ షీల్డ్ లు కరోనా నుంచి కాపాడలేవని అంటోంది అధ్యయనం. ఎందుకంటే.. ఫేస్ షీల్డ్ పూర్తిగా ముఖాన్ని కప్పేయదు.. పైభాగం కింది భాగంలో చాలా గ్యాప్ ఉంటుంది.
plastic face shields
ఎవరైనా కరోనా సోకిన పేషెంట్ తుమ్మినా లేదా దగ్గినా తుంపర్లు గాలి ద్వారా ప్రయాణించి ముక్కు లేదా నోటిని చేరే అవకాశం ఉంది. ఒక మీటర్ (39.3 అంగుళాలు) దూరంలో తుమ్మిన వ్యక్తి నుంచి ఎదుట వ్యక్తికి 0.5 సెకన్ల నుంచి ఒక సెకను వ్యవధిలో తుంపర్లు ప్రయాణిస్తాయి.



అదే సమయంలో ముఖానికి ఫేస్ షీల్డ్ ధరించిన వ్యక్తి అపశవ్య దిశలో ముఖాన్ని ఉంచితే వైరస్ తుంపర్లు నేరుగా ముక్కు లేదా నోటిని చేరే ప్రమాదం ఉందని జపాన్ లోని Fukuoka University సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. తుమ్మిన వ్యక్తి తుంపర్ల వేగం షీల్డ్ ఉపరితలాన్ని తాకగానే అవి పైనుంచి కిందిభాగం అంచునకు తుంపర్లు చిందే అవకాశం ఉంటుంది.

plastic face shields

ఆ సమయంలో షీల్డ్ ధరించిన వ్యక్తి పక్కకు వంచినా లేదా గాల్చి పీల్చినా తుంపర్లు గాలి ద్వారా ముక్కు, నోట్లోకి వ్యాపించే అవకాశం ఉంది. వాస్తవానికి ఫేస్ షీల్డ్ ఒకటి మాత్రమే కరోనా నుంచి రక్షించలేదని, మాస్క్ కూడా తప్పనిసరిగా ధరించాలని డాక్టర్ Dr Fujio Agaki సూచిస్తున్నారు.