ఎన్నికల్లో ఓడినా.. ప్రమాణస్వీకారానికి ట్రంప్ ఏర్పాట్లు!

  • Published By: vamsi ,Published On : November 14, 2020 / 10:38 AM IST
ఎన్నికల్లో ఓడినా.. ప్రమాణస్వీకారానికి ట్రంప్ ఏర్పాట్లు!

అమెరికా ఎన్నికల తంతు ముగిసి రోజులు గడుస్తున్నాయి. అయితే ఎన్నికల్లో గెలిచిన బైడెన్‌ను అడ్డుకోవటానికి రిపబ్లికన్లు వేస్తున్న లిటిగేషన్లను కోర్టులు తిరస్కరిస్తుంటే.. అమెరికాలో రెండవసారి ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చెయ్యడానికి సిద్ధం అయిపోతున్నాడు ట్రంప్. ప్రస్తుతం వైట్‌హౌస్‌ అధిపతిగా ఉన్న ట్రంప్‌.. మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నారు.



అమెరికా అధ్యక్ష ఎన్నికలలో బైడెన్‌ గెలిచానా కూడా ట్రంప్ అంగీకరించడంలేదు. డెమొక్రాట్లు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి, ఓట్ల లెక్కింపులో తేడాలు కారణంగా గెలిచారు అంటూ ఎన్నికల్లో గెలిచించి తానే అంటూ తనకు తానే ప్రకటించుకున్నారు ట్రంప్.

ఈ క్రమంలోనే వైట్‌హౌస్ వర్గాలు ట్రంప్ రెండవసారి ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకు సంబంధించి వైట్‌హౌస్‌లో ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయని వైట్‌హౌస్ సిబ్బంది చెబుతున్నారు.



బైడెన్‌ జనవరి 20న పదవి ప్రమాణస్వీకారం చేయాల్సి ఉండగా.. అంతకు ముందుగానే ట్రంప్ రెండవసారి ప్రమాణస్వీకారం చెయ్యనున్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో మీడియా మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించేందుకు అవసరమైన చర్యలను వైట్‌హౌస్ తీసుకుంటుందని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు.