కాస్ట్ కటింగ్ : 350 నోకియా ఉద్యోగాల్లో కోత!

ఫిన్నీస్ టెలికమ్యూనికేషన్ దిగ్గజం నోకియా ఉద్యోగాల్లో కోత విధించనుంది. ఈ మేరకు ఉద్యోగాల్లో కోత విధించే దిశగా నోకియా ప్రణాళికలు రచిస్తున్నట్టు ఓ మీడియా నివేదిక వెల్లడించింది.

  • Published By: sreehari ,Published On : January 16, 2019 / 07:53 AM IST
కాస్ట్ కటింగ్ : 350 నోకియా ఉద్యోగాల్లో కోత!

ఫిన్నీస్ టెలికమ్యూనికేషన్ దిగ్గజం నోకియా ఉద్యోగాల్లో కోత విధించనుంది. ఈ మేరకు ఉద్యోగాల్లో కోత విధించే దిశగా నోకియా ప్రణాళికలు రచిస్తున్నట్టు ఓ మీడియా నివేదిక వెల్లడించింది.

ఫిన్నీస్ టెలికమ్యూనికేషన్ దిగ్గజం నోకియా ఉద్యోగాల్లో కోత విధించనుంది. ఉద్యోగాల్లో కోత విధించే దిశగా నోకియా ప్రణాళికలు రచిస్తున్నట్టు ఈ మేరకు ఓ మీడియా నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో ఉద్యోగాల్లో నోకియా.. కోత విధించే యోచనలో ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఫిన్ లాండ్ లో నోకియాలో 6వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఫిన్ లాండ్ లో ఈ ఏడాది 350 మంది నోకియా ఉద్యోగులను తొలగించి సంస్థ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని భావిస్తోంది. 2020 ఆఖరు నాటికి ఏడాదికి 700 మిలియన్ల యూరోల ఖర్చును తగ్గించుకోవాలని నోకియా లక్ష్యంగా పెట్టుకున్నట్టు నివేదిక తెలిపింది. ఇతర దేశాల్లో కూడా సేవింగ్స్ ప్రొగ్రామ్ ను అమలు చేయాలని యోచనలో ఉంది. ఓలూ ప్రొడక్షన్ ఫెసిలిటీ మినహాయించి ఫ్రాన్స్, జర్మనీలో ఎక్కువ శాతం ఉద్యోగాల్లో కోత విధించనుంది.

కానీ, దీనిపై స్పష్టత లేదని నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం టెలికమ్యూనికేషన్ రంగంలో తలెత్తిన పోటీ కారణంగా పలు మొబైల్ సంస్థలు కొత్త ప్రొడక్ట్ లతో మార్కెట్లోకి దూసుకొస్తున్నాయి. ఈ తరుణంలో పోటీ వాతావారణాన్ని తట్టుకోవాలంటే ఆర్థికంగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ క్రమంలో నోకియా ఉద్యోగాల్లో కోత విధించడానికి 5జీ టెక్నాలజీ ప్రారంభమే కారణమనే వార్తలను తీవ్రంగా ఖండించింది. ఫిన్ లాండ్ నోకియా డైరెక్టర్ ఇంచార్జ్ టొమ్మి ఉట్టో మాట్లాడుతూ.. నోకియాలో మార్పులు అనివార్యమన్నారు. అదే సమయంలో ఫ్రాన్స్ లో జనరల్ కాన్ఫిడరేషన్ లేబర్ (సీజీటీ) నోకియాపై ఆరోపణలు గుప్పించింది. ఫ్రాన్స్ లో లేబర్ కాస్ట్ తక్కువ అయినప్పటికీ ఇతర దేశాలకు ఉద్యోగాలను మళ్లీస్తుందని ఆరోపించింది.