Airtel కొత్త ఆఫర్ : రూ.299తో రీఛార్జ్.. అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఫ్రీ

మీరు ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లా? మీకో గుడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ దిగ్గజం ఎయిర్ టెల్ తమ ప్రీపెయిడ్ యూజర్ల కోసం కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది.

  • Published By: sreehari ,Published On : May 3, 2019 / 08:12 AM IST
Airtel కొత్త ఆఫర్ : రూ.299తో రీఛార్జ్.. అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఫ్రీ

మీరు ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లా? మీకో గుడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ దిగ్గజం ఎయిర్ టెల్ తమ ప్రీపెయిడ్ యూజర్ల కోసం కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది.

మీరు Airtel ప్రీపెయిడ్ కస్టమర్లేనా? మీకో గుడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ దిగ్గజం ఎయిర్ టెల్ తమ ప్రీపెయిడ్ యూజర్ల కోసం కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. అదే.. ఎయిర్ టెల్ థ్యాంక్స్ ప్రొగ్రామ్ (#AirtelThanks program) ఆఫర్ . ఈ కొత్త ఆఫర్ యాక్టివేట్ చేసుకున్న యూజర్లకు అన్ లిమిటెడ్ డేటాతో అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఫ్రీగా పొందవచ్చు. ఈ కొత్త ఆఫర్ యాక్టివేట్ చేసుకోవాలంటే.. Airtel Prepaid యూజర్లు రూ.299తో రీఛార్జ్ చేసుకుంటే చాలు.. 28 రోజుల కాల పరిమితిపై రోజుకు 2.5GB డేటా పొందవచ్చు.

ఇందులో Unlimited Calls తో పాటు రోజుకు 100 SMSలు, అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ను కూడా ఉచితంగా ఎయిర్ టెల్ అందిస్తోంది. ఇప్పటివరకూ ఎయిర్ టెల్ ఇన్ఫినిటీ పొస్టుపెయిడ్ ప్లాన్లలో మాత్రమే అమెజాన్ ప్రైం మెంబర్ షిప్ ను లిమిట్ గా అందిస్తు వచ్చింది. ఇప్పుడు ఆ ప్లాన్ పేరులో మార్పులు చేస్తూ.. ‘ఎయిర్ టెల్ థ్యాంక్స్’ పేరుతో కొత్త యాప్ ప్రవేశపెట్టింది. 

Amazon Prime Membership Free యాక్టివేట్ చేసుకోవాలంటే ఈ కొత్త యాప్ ను యూజర్లు ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్ టెల్ యూజర్లు.. రూ.299 ప్రీపెయిడ్ ప్యాక్ రీఛార్జ్ చేయిస్తే.. అమెజాన్ ప్రైం వీడియో, ప్రైం మ్యూజిక్, ప్రైం రీడింగ్, అన్ లిమిటెడ్ ఫ్రీ ఫాస్ట్ షిప్పింగ్ వంటి ఆఫర్లను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ప్రీపెయిడ్ ఆఫర్ బండెల్.. అన్ని రిటైలర్, ఎయిర్ టెల్ స్టోర్లలో అందుబాటులో ఉంది.

ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్, అధికారిక వెబ్ సైట్..  www.airtel.in తో పాటు అన్ని ఆన్ లైన్ ప్లాట్ ఫాంల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎయిర్ టెల్ కస్టమర్లు ఈ కొత్త ప్రీపెయిడ్ ప్యాక్ ను అమెజాన్ అధికారిక వెబ్ సైట్ Amazon.in, Amazon Pay నుంచి కూడా కొనుగోలు చేసుకోవచ్చు.  

జియో, వోడాఫోన్ ఐడియాకు పోటీగా :
రిలయన్స్ మొబైల్ డేటా సంచలనం జియో, వోడాఫోన్ ఐడియాలకు పోటీగా భారతీ ఎయిర్ టెల్ కూడా అమెజాన్ ప్రైం మెంబర్ షిప్ ను ఫ్రీగా ఆఫర్ చేస్తోంది. ఇప్పటికే రిలయన్స్ జియో సినిమా, టీవీ సబ్ స్ర్రైబర్లు, జియో సైతం ఓటీటీ ప్లాట్ ఫాం సబ్ స్ర్కిప్షన్లను ఆఫర్ చేస్తోంది.

OTT ప్లాట్ ఫాంలైన జీ5, సోనీలైవ్, హుక్, హంగామా టీవీ యాప్స్ ద్వారా తమ టీవీ యాప్స్ ఎయిర్ టెల్ టీవీ, జియో టీవీ, వోడాఫోన్ ప్లే పై ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ యూజర్లకు ఆఫర్లు అందిస్తున్నాయి. ఓటీటీ బ్రాండ్ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ రూ.399 నెలవారీ ప్లాన్లతో పోస్టుపెయిడ్ యూజర్లు లిమిటిడ్ యాక్సస్ చేసుకోవచ్చు.

నెట్ ఫ్లిక్స్ యాక్సస్ ఎయిర్ టెల్ నెట్ వర్క్ పై మాత్రమే అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైం మాత్రం.. ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలో కూడా అందుబాటులో ఉంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సర్వీసులను ఎలాంటి సబ్ స్ర్కిప్షన్ ఛార్జీలు లేకుండా కేవలం డేటా ఆధారంగా మాత్రమే యూజర్లకు అందిస్తున్నాయి. భారతీ ఎయిర్ టెల్.. అమెజాన్ ప్రైం సర్వీసును తమ ప్రీపెయిడ్ యూజర్లకు కూడా  అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎయిర్ టెల్.. థ్యాంక్స్ ప్రొగ్రామ్ పేరుతో ఈ కొత్త ఆఫర్ ప్రకటించింది.