Amazfit GTR mini : కొత్త మినీ స్మార్ట్‌వాచ్ వచ్చేసిందోచ్.. కేవలం రూ.9,990 మాత్రమే.. ఎన్ని హెల్త్ ఫీచర్లంటే?
Amazfit GTR mini : ప్రముఖ స్మార్ట్‌వాచ్ మేకర్ (Amazfit) భారతీయ మార్కెట్లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. రౌండ్ డయల్, స్లిమ్ ప్రొఫైల్‌తో GTR మినీ 120+ స్పోర్ట్స్ మోడ్‌లు, 24/7 హార్ట్ రేట్, SPO2, అడ్వాన్స్‌డ్ హెల్త్ మానిటరింగ్ ఫీచర్‌తో వస్తుంది.

Amazfit GTR mini : ప్రముఖ స్మార్ట్‌వాచ్ మేకర్ (Amazfit) భారతీయ మార్కెట్లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది. రౌండ్ డయల్, స్లిమ్ ప్రొఫైల్‌తో GTR మినీ 120+ స్పోర్ట్స్ మోడ్‌లు, 24/7 హార్ట్ రేట్, SPO2, అడ్వాన్స్‌డ్ హెల్త్ మానిటరింగ్ ఫీచర్‌తో వస్తుంది. స్టైల్, ఫంక్షనాలిటీకి వాల్యూ ఇచ్చే యూజర్లకు ఈ డివైజ్ బాగా సరిపోతుందని కంపెనీ తెలిపింది.
అమాజ్‌ఫిట్‌లో వేరబుల్ టెక్నాలజీలో అమాజ్‌ఫిట్ GTR మినీని లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని కంపెనీ పేర్కొంది. ఫిట్‌నెస్ నుంచి ఫ్యాషన్ వరకు అన్ని అమాజ్‌ఫిట్‌లో యాక్సస్ చేసుకోవచ్చునని తెలిపింది. GTR మినీ వాచ్‌లో అత్యాధునిక ఫీచర్‌లతో అద్భుతమైన డిజైన్‌ను అందిస్తుంది. అంతేకాదు.. స్మార్ట్‌వాచ్ యూజర్లు తమ ఫిట్‌నెస్ గోల్స్ ట్రాక్ చేసేందుకు కనెక్ట్ అయ్యేందుకు సాయపడుతుందని అమాజ్‌ఫిట్ ప్రతినిధి తెలిపారు.
అమాజ్‌ఫిట్ GTR మినీ ధర ఎంతంటే? :
అమాజ్‌ఫిట్ GTR మినీ వాచ్ ప్రారంభ ధర రూ. 10,999 వద్ద లాంచ్ అయింది. ఈ డివైజ్ అమెజాన్ ఇండియా (Amazon Inida)లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో అద్భుతమైన ఫీచర్లు, ఫంక్షనాలిటీల రేంజ్ అందిస్తుంది. మిడ్‌నైట్ బ్లాక్, మిస్టీ పింక్, ఓషన్ బ్లూ వంటి కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Amazfit GTR mini launched in India, price set at Rs 9,990
అమాజ్‌ఫిట్ GTR మినీ స్పెసిఫికేషన్‌లు ఇవే :
అమాజ్‌ఫిట్ GTR మినీ వాచ్.. 1.28-అంగుళాల HD AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 326 PPIతో క్లియర్ విజువల్స్‌ను అందిస్తుంది. ఏ లైటింగ్ కండిషన్‌లోనైనా రీడ్ చేసేందుకు వీలుగా ఉంటుంది. స్మార్ట్‌వాచ్ (Zepp) యాప్‌కి అనుకూలంగా ఉంటుంది. స్మార్ట్‌వాచ్ బయోట్రాకర్‌పిపిజి ఆప్టికల్ సెన్సార్‌తో సహా కీలకమైన ట్రాకర్‌లతో వస్తుంది. రియల్ టైమ్ హార్ట్ రేటు, బ్లడ్-ఆక్సిజన్ సాచురేషన్, ఒత్తిడి స్థాయిని మానిటర్ చేస్తుంది.
వినియోగదారులు తమ శరీర పనితీరును గతంలో కన్నా సులభంగా అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. మీరు 24-గంటల హెల్త్ మానిటరింగ్ యాక్టివ్ చేసినప్పుడు, హై లేదా లో హార్ట్ రేట్, తక్కువ SpOâ‚ అధిక-ఒత్తిడి స్థాయిలు వంటి అసాధారణ రీడింగ్‌లను గుర్తించి వాచ్ యూజర్లను హెచ్చరిస్తుంది. ఒత్తిడిని తగ్గించే శ్వాస వ్యాయామాలను కూడా సిఫార్సు చేస్తుంది.
ఈ వాచ్.. వన్ ట్యాప్ మెజరింగ్ ఫంక్షన్‌తో కూడా వస్తుంది, వినియోగదారులు కేవలం ఒక ట్యాప్‌తో 3 మెట్రిక్స్ ఏకకాలంలో కొలవవచ్చు. 15 సెకన్లలో వాటి ఫలితాలను పొందవచ్చు. Amazfit GTR మినీ హ్యూమంగస్ బ్యాటరీ లైఫ్‌తో వస్తుందని పేర్కొంది. సాధారణ వినియోగంతో ఒకే ఛార్జ్‌పై 14 రోజుల పాటు వస్తుంది. బ్యాటరీ సేవర్ మోడ్‌లో ఉంటే 20 రోజుల వరకు కూడా పని చేస్తుంది. లాంగ్ బ్యాటరీ లైఫ్ ద్వారా ఎక్కువకాలం మన్నికగా పనిచేస్తుంది. సమర్థవంతమైన స్మార్ట్‌వాచ్ కోరుకునే వినియోగదారుల్లో ఎవరికైనా ఈ వాచ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
Read Also : Amazfit GTS 4 Mini : 15 రోజుల బ్యాటరీ లైఫ్‌తో అమాజ్‌ఫిట్ కొత్త స్మార్ట్‌వాచ్.. ఫీచర్లు అదుర్స్!