ఫ్యాషన్ రాజధానిలో పాగా వేసిన అరకు కాఫీ 

  • Published By: chvmurthy ,Published On : February 11, 2020 / 03:19 AM IST
ఫ్యాషన్ రాజధానిలో పాగా వేసిన అరకు కాఫీ 

విశాఖ మన్యంలో పండిన  కాఫీ ఫ్యాషన్ రాజధాని పారిస్ లో పాగా వేసింది.  భారత ప్రజల మనసు దోచుకున్న కాఫీ పారిస్ ప్రజల మనసూ దోచుకుంది.  ఎంతలా అంటే అరకు కాఫీ తాగనిదే రోజు గడవనంతగా…  కాఫీ అనేది ఒక ఉత్సాహపానీయము. కాఫీ చెట్ల పండ్ల నుండి లభించే గింజలను ఎండబెట్టి వేగించి పొడి చేసి కాఫీ తయారీకి ఉపయోగిస్తారు.

కాఫీ గింజలను దాదాపు 70 దేశాలలో పండిస్తున్నారు. కాఫీ పంటను ముఖ్యముగా లాటిన్ అమెరికా, దక్షిణా ఈశాన్య ఆసియా మరియు ఆఫ్రికాదేశాలలో విస్తారంగా పండిస్తున్నారు. వేయించని పచ్చి కాఫీ గింజల వాణిజ్యము ప్రపంచంలో అత్యధికంగా జరిగే ప్రసిద్ధ వాణిజ్యాలలో ఒకటి.మనదేశంలో కాఫీ పండించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంకోసం పోటీపడుతోంది. 
south india cofee

అరకు కాఫీ 
సహజ సిద్ధంగా కుళ్లిన ఆకులు వేసి పెంచిన ఆర్గానిక్‌ అరకు కాఫీ విదేశాల్లోనూ దూసుకెళ్తోంది. విశాఖ మన్యంలో సాగవుతున్న అరబికా రకం కాఫీ పారిస్‌లో ఇప్పటికే పాగా వేసింది. జపాన్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్‌ దేశాల్లోనూ విక్రయాలు పెరిగి అక్కడి కాఫీ ప్రియులకూ మన కాఫీ నోరూరిస్తూ సత్తా చాటుతోంది. ఫ్యాషన్‌ ప్రపంచ రాజధాని పారిస్‌లోనూ అరకు కాఫీ బ్రాండ్‌తో 2017, ఫిబ్రవరిలోనే కాఫీ షాప్‌ వెలిసింది. నాంది ఫౌండేషన్‌కు అనుబంధంగా మహీంద్రా గ్రూప్‌నకు చెందిన అరకు గ్లోబల్‌ హోల్డింగ్స్‌ సంస్థ దీన్ని అక్కడ ఏర్పాటు చేసింది.  కాఫీ సాగు విస్తరణలో మనదేశంలో తమిళనాడును వెనక్కినెట్టి కర్ణాటక తర్వాత రెండో స్థానం కోసం కేరళతో పోటీపడుతోంది.
araku coffee  1

విశాఖ మన్యంలో పండించిన కాఫీ గింజలను గిరిజన రైతుల నుంచి వివిధ సంస్థలతో పాటు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఇందులో ప్రధానమైంది. నాంది ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ 20 వేల ఎకరాల్లో కాఫీ గింజలను పదేళ్లుగా కొనుగోలు చేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తోంది. విశాఖ మన్యంలో పండే  కాఫీకి విదేశాల్లోనూ మంచి డిమాండ్ వుంది. కాఫీ ప్రపంచంలో అత్యధికంగా సేవించే ఉత్తేజపూరితమైన పానీయము.

ప్రపంచ వ్యాప్తంగా అన్నిప్రాంతాలలో దొరికే ఈ పానీయం. పెద్దల నుండి పిన్నల వరకు అలవాటు పడ్డారు. ప్రస్తుతం  మన ఇంటికి స్నేహితులో బంధువులో  వచ్చినపుడు  వారికి కాఫీ ఇచ్చి  గౌరవిస్తుంటాం. విందులు వినోదాలలో కాఫీ అతి ముఖ్యమైన పానీయం అయ్యింది. ఉత్తర అమెరికాలో 1688లోనే కాఫీ సేవించినట్లు చరిత్ర చెపుతోంది. కాఫీ అనేక సమాజాలలో వారి సంస్కృతిలో ప్రధాన పాత్ర వహిస్తూ జీవిత ఆహారపు శైలిలో ఒక భాగం అయింది.  
araku coffee 2

కాఫీ వల్ల ఉపయోగాలు 
కాఫీ గింజలలో ఉన్న కాఫి అనే పదార్ధము మానవులను ఉత్సాహపరుస్తుందని తెలుస్తోంది. ప్రతిరోజూ coffee తాగితే గుండెజబ్బులు, మధుమేహము వచ్చే అవకాశము తగ్గుతుంది . కాఫీ వాడకం వల్ల వృద్ధాప్యము దూరమవుతుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు, coffee లోని కెఫిన్‌ .. న్యూరొట్రాన్స్మిటర్స్ అయిన ” నార్ ఎడ్రినాలిన్‌ , అసిటైల్ కొలిన్‌ , డోపమైన్‌” స్థాయిలను ఎక్కువ చేస్తుంది . వీటిమూలాన పనిలో ఏకాగ్రత, చురుకుతనము, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి కెఫిన్‌ తక్కువమోతాదో ఉత్సాహాన్ని పెంచి … అలసటను తగ్గిస్తుంది, కెఫిన్‌ మెటబాలిక్ రేట్ ను ఎక్కువచేస్తుంది ….తాత్కాలికంగా ఉసారుగా ఉండేటట్లు చేస్తుంది . కెఫిన్‌ క్యాస్సర్ వచ్చే అవకాశాలు తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు .
araku coffee 3

కెఫిన్‌ ” పార్కిన్‌సోనిజం ” జబ్బు వచ్చే అవకాశాలు తగ్గిస్తుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు . కెఫిన్‌ ” టైప్ 2 మెధుమేహము ” వచ్చే రిష్క్ తగ్గిస్తుందని ఆధారాలు ఉన్నాయి. కెఫిన్‌ కొన్ని కాలేయ క్యాన్సర్లు రానీయదని పరిశోధనలు ఉన్నాయి . అసలు రోజుకో మూడుకప్పులు కాఫీ తాగితేచాలు.. మతిమరపు దూరం అవుతుందంటున్నాయి తాజా పరిశోధనలు.

రోజూ కాఫీ తీసుకుంటే దానిలోవుండే కెఫిన్ వల్ల యాంటీ ఆక్సిడెంట్లు మెదడులోకి చేరే కాలుష్యాలను అడ్డుకోవడంతోపాటు పార్కిన్ సన్ వ్యాధి నిరోధానికి కూడా మంచి ఔషధంగా పని చేస్తుందంటున్నారు సైంటిస్టులు. కాఫీ వాడకం గురించి వచ్చిన  కొత్త నివేదిక  ప్రకారం రోజూ కాఫీ తాగేవారి శరీరంలో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు చేరిన కారణంగా మెమరీ పవర్ పెరిగినట్టు గమనించారు.

దేశంలో రెండో స్థానానికి పోటీ..
రాష్ట్రంలో కాఫీ తోటలు విస్తరించాలనే లక్ష్యంతో పాడేరు ఐటీడీఏ ప్రణాళిక అమలు చేస్తోంది. గత నాలుగేళ్లలో మొత్తం 42 వేల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరించాయి. వీటిని 2025–26 నాటికి మరో 58 వేల ఎకరాలకు విస్తరించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఇందుకోసం చింతపల్లి మండలంలో పైలట్‌ ప్రాజెక్టుగా రైతు సంఘాలను ఏర్పాటు చేశారు. మూడేళ్లపాటు సిల్వర్‌ ఓక్‌ చెట్లు పెరిగిన తర్వాత వాటి మధ్య అంతర పంటగా కాఫీ మొక్కలు, మిరియాల పాదులు నాటుకోవడానికి ఐటీడీఏ సహకరిస్తోంది.  

2025–26 నాటికి మన్యంలో 2 లక్షల విస్తీర్ణంలో కాఫీ తోటలు విస్తరిస్తే దేశంలోనే 20 వేల మెట్రిక్‌ టన్నుల కాఫీ ఉత్పత్తితో కర్ణాటక తర్వాత ద్వితీయ స్థానానికి ఏపీ చేరుకుంటుంది. ప్రస్తుతం 1.50 లక్షల ఎకరాల్లో కాఫీ సాగుతో తమిళనాడును వెనక్కినెట్టి మూడో స్థానానికి చేరింది. ఒక మొక్క నుంచి క్లీన్‌ కాఫీ గింజలు ఏటా కిలో నుంచి 1.20 కిలోల వరకు దిగుబడి వస్తుంది. ఒక మెట్రిక్‌ టన్ను కాఫీ గింజల ధర ప్రస్తుతం రూ.1.50 లక్షల వరకు ఉంది.  

araku coffee 4

విదేశీ ఎగుమతులే కీలకం 
భారతదేశంలో పండుతున్న కాఫీలో 80 శాతం విదేశాలకే ఎగుమతి అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో కాఫీ సాగు చేస్తున్నా ఎగుమతుల్లో భారత్‌ ఆరో స్థానంలో ఉంది. కర్ణాటకలో  కార్పొరేట్‌ స్థాయిలో సాగు చేస్తుండటంతో ఎకరానికి 225 కిలోలు దిగుబడి వస్తుండగా, విశాఖ మన్యంలో 100 నుంచి 120 కిలోల వరకు వస్తోంది. కాఫీ, అంతరపంటగా మిరియాల సాగు లాభసాటిగా ఉండటంతో గిరిజన రైతులు ఇటువైపు మొగ్గు చూపిస్తున్నారని, దీంతో మరో లక్ష ఎకరాల్లో కాఫీ విస్తరించే అవకాశం ఉందని పాడేరు ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టు సహాయ సంచాలకులు తెలిపారు.