Bank లో పని ఉందా : తొందరపడండి..త్రీ డేస్ Holidays

Bank లో పని ఉందా : తొందరపడండి..త్రీ డేస్ Holidays

Bank-Holidays

Bank Holidays in December 2020 : బ్యాంకు (Bank)లో ఏమైనా పని ఉందా ? లావాదేవీలు నిర్వహించుకోవాలంటే..తొందరగా ఆ పని చేసుకోండి. ఎందుకంటే…వరుసగా సెలవులు (holidays) వచ్చేస్తున్నారు. మూడు రోజుల పాటు బ్యాంకులకు తాళాలు పడనున్నాయి. సెలవలకు అనుగుణంగా బ్యాంకులకు సంబంధించిన పనులు చక్కదిద్దుకుంటే బెటర్ అని సూచిస్తున్నారు. డిసెంబర్ (December) నెలలో వరుసగా త్రీడేస్ బ్యాంకులు పని చేయవు. డిసెంబర్ 24వ తేదీకల్లా..బ్యాంకులో పని ఉంటే..ముందే ముగించుకోవడం బెటర్.

అంతేగాకుండా..పన్ను చెల్లింపు దారులు కూడా డిసెంబర్ 31వ తేదీకల్లా…ఐటీఆర్ (ITR) దాఖలు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా..రెండు, నాలుగో శనివారాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుందనే సంగతి తెలిసిందే. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ (christmas festival). ఈ రోజు బ్యాంకులు పనిచేయవు. తెల్లారితే శనివారం. అంటే..డిసెంబర్ 26న ఫోర్త్ శనివారం వచ్చింది. అంటే ఈ రోజు హాలిడే. దీని తర్వాత..ఆదివారం (Sunday) ఎలాగూ సెలవు. అంటే..శుక్రవారం నుంచి ఆదివారం వరకు బ్యాంకులు మూడు రోజులు క్లోజ్‌లోనే ఉంటాయి. డిసెంబర్ 24కల్లా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం డిసెంబర్ నెలలో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు, కిస్మస్ పండుగలు వచ్చాయి. డిసెంబర్ 06, డిసెంబర్ 13, డిసెంబర్ 20, డిసెంబర్ 27 తేదీల్లో ఆదివారం వచ్చింది. డిసెంబర్ 12 రెండో శనివారం, డిసెంబర్ 26 నాలుగో శనివారం బ్యాంకులకు హాలిడే. డిసెంబర్ 25 క్రిస్మస్. మొత్తంగా…బ్యాంకులకు ఈ నెలలో ఏడు రోజుల పాటు సెలవులు వచ్చాయి.