Sunroof Cars: తక్కువ కాస్ట్‌లో సన్‌రూఫ్‌ కార్లు.. మోడళ్లు, ధరలు ఇవే!

సన్‌రూఫ్ కార్లలో తిరగాలి అంటే ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ ఇంట్రెస్టే.. ఇటీవలికాలంలో కాస్త కాస్ట్ ఎక్కువైనా కూడా సన్‌రూఫ్ కార్లవైపే ఇంట్రస్ట్ చూపుతున్నారు.

Sunroof Cars: తక్కువ కాస్ట్‌లో సన్‌రూఫ్‌ కార్లు.. మోడళ్లు, ధరలు ఇవే!

Sun Roof

Cheapest Cars With Sunroof: సన్‌రూఫ్ కార్లలో తిరగాలి అంటే ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ ఇంట్రెస్టే.. ఇటీవలికాలంలో కాస్త కాస్ట్ ఎక్కువైనా కూడా సన్‌రూఫ్ కార్లవైపే ఇంట్రస్ట్ చూపుతున్నారు కార్ల కొనుగోలుదారులు. అయితే, సన్‌రూఫ్ కార్ల ఖరీదు చాలా ఎక్కువ అనే భ్రమలు చాలా మందిలో ఉన్నాయి. అసలు విషయం ఏమిటంటే? సన్‌రూఫ్ కార్లు కూడా చాలా తక్కువ ధరల్లో లభిస్తున్నాయి.

సన్‌రూఫ్ లేని కార్ల కంటే సన్‌రూఫ్ ఉన్న కార్లు చాలా ఖరీదైనవే.. కానీ, మీరు చౌకైన సన్‌రూఫ్ ఉన్న కారు కోసం చూస్తున్నట్లయితే, భారతదేశంలో ఏ కార్లు తక్కువ ధరకు సన్‌రూఫ్‌ను అందిస్తాయో ఇప్పుడు మీరు తెలుసుకోండి. వీటిలో మహీంద్రా XUV300, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, హ్యుండయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్ వంటి కార్లు అందులో ఉన్నాయి.

TATA Nexon:
టాటా Nexon XM(S)లో సన్‌రూఫ్ ఉండగా.. దీని ధర దాదాపు 8.86 లక్షలుగా ఉంది. ఇది ఆటో-ఫోల్డింగ్ అవుట్‌సైడ్ రియర్‌వ్యూ మిర్రర్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, 4-స్పీకర్ హర్మాన్ సౌండ్ సిస్టమ్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

కియా సోనెట్:
కియా సోనెట్ అనేది SUV కారు. ఇందులో కూడా సన్‌రూఫ్ ఫీచర్ ఉంది. సన్‌రూఫ్ కారు HTX వేరియంట్‌లో అందుబాటులో ఉంది. దీని ధర దాదాపు 8.70 లక్షల రూపాయలు.

హ్యుందాయ్ ఐ20:
పాత హ్యుందాయ్ ఐ20లో సన్‌రూఫ్ లేదు. అయితే, కొత్త తరం హ్యుందాయ్ ఐ20లో సన్‌రూఫ్ అందుబాటులో ఉంది. సన్‌రూఫ్‌తో కూడిన హ్యుందాయ్ ఐ20 ధర దాదాపు రూ.9.4 లక్షలు.

హ్యుందాయ్ వెన్యూ:
హ్యుందాయ్ వెన్యూలో సన్‌రూఫ్ ఫీచర్‌ అందుబాటులో ఉండగా.. సన్‌రూఫ్‌తో కూడిన హ్యుందాయ్ వెన్యూ ధర దాదాపు రూ.9.97 లక్షలుగా ఉంది. హ్యుందాయ్ వెన్యూ అమ్మకాలు సన్‌రూఫ్ కారణంగా అద్భుతంగా ఉన్నట్లు ఆటో మొబైల్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

మహీంద్రా XUV300:
మహింద్రాలో సన్‌రూఫ్ ఉన్న కారు ధర దాదాపు రూ.9.9 లక్షలుగా ఉంది. ఈ కారులో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్:
ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లో సన్‌రూఫ్ ఆప్షన్ ఇందులో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ఎకోస్పోర్ట్ టైటానియం వేరియంట్‌ కారు ప్రారంభ ధర దాదాపు రూ. 8.20 లక్షలుగా ఉంది. అయితే సన్‌రూఫ్ ఉంటే వేరియంట్ ధర దాదాపుగా రూ.11.70లక్షల వరకు ఉండవచ్చు.