ODI World Cup 2023 : క్రికెట్ లవర్స్‌కు పండుగే.. సరికొత్త ఫీచర్లతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. వన్డే ప్రపంచ కప్‌ 2023 స్ట్రీమింగ్ ఇలా చూడొచ్చు!

ODI World Cup 2023 : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) మొబైల్ వినియోగదారుల కోసం 2023 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ (ICC Cricket World Cup 2023) ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ అందిస్తోంది. క్రికెట్ వీక్షకుల కోసం సరికొత్త ఫీచర్లను కూడా ప్రవేశపెట్టింది.

ODI World Cup 2023 : క్రికెట్ లవర్స్‌కు పండుగే.. సరికొత్త ఫీచర్లతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. వన్డే ప్రపంచ కప్‌ 2023 స్ట్రీమింగ్ ఇలా చూడొచ్చు!

Disney Plus Hotstar to Stream ICC Cricket World Cup, adds new features to enhance viewing experience in Telugu

ODI World Cup 2023 : ప్రముఖ ఆన్‌లైన్ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) 2023 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ (ICC Cricket World Cup 2023) అధికారిక స్ట్రీమింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది. అయితే, అక్టోబర్ 5 (గురువారం) నుంచి నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇంగ్లాండ్‌తో ప్రారంభ మ్యాచ్ నుంచి డిస్నీ ప్లాట్‌ఫారమ్ లైవ్ మ్యాచ్ స్ట్రీమింగ్ అందిస్తోంది.

ఇందులో డే మ్యాచ్‌లు ఉదయం 10:30 ప్రారంభం కానుండగా, డే-నైట్ మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి. సెమీఫైనల్స్, ఫైనల్స్ కూడా మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతాయి. ముఖ్యంగా, (Disney+ Hotstar Mobile Version) మొబైల్ వినియోగదారుల కోసం లైవ్ మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేస్తోంది.

లైవ్ ఫీడ్, వీడియో స్ట్రీమింగ్ ఫీచర్ అప్‌గ్రేడ్ :

ఆసక్తికరంగా, గత ఏడాదిలో 2023-2027 IPL కోసం (JioCinema) ఆన్‌లైన్ హక్కులను కోల్పోయిన తర్వాత భారత్‌లో డిస్నీ ప్లాట్‌ఫారం ప్రపంచ కప్, డిజిటల్ స్ట్రీమింగ్ రెండింటికీ ప్రత్యేక హక్కులను కలిగి ఉంది. ప్రత్యేకించి.. మొబైల్ యూజర్ల కోసం ఫ్రీ క్రికెట్ స్ట్రీమింగ్‌తో పాటు, సరికొత్త ఫీచర్లను కూడా ప్రవేశపెట్టింది.

Read Also : Top SUV Sales in September : సెప్టెంబర్ 2023లో అత్యధికంగా అమ్ముడైన టాప్ SUV కార్లు ఇవే.. టాటా నెక్సాన్ రికార్డు సేల్స్..!

స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 కోసం లైవ్ ఫీడ్, వీడియో స్ట్రీమింగ్ ఫీచర్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో AI-ఆధారిత వీడియో క్లారిటీని అందిస్తుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఐసీసీ వరల్డ్ కప్ లైవ్ స్ట్రీమింగ్ సమయంలో అందుబాటులో ఉన్న అన్ని ఫీచర్లను వివరంగా పరిశీలిద్దాం.

మెరుగైన స్ట్రీమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం సరికొత్త ఫీచర్లు :

1. MaxView Vertical Viewing : ICC భాగస్వామ్యంతో, డిస్నీ+ హాట్‌స్టార్ (MaxView)ని ప్రవేశపెట్టింది, వినియోగదారులు క్రికెట్ మ్యాచ్‌లను వర్టికల్ మోడ్‌లో ఒక చేతితో వీక్షించడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ లైవ్ ఫీడ్, స్కోర్‌కార్డ్, యాడ్ ఫార్మాట్‌లను డిస్‌ప్లే చేస్తుంది. ప్రత్యేక వర్టికల్ క్రికెట్ చూసే ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

2. Optimized Data Usage : డేటా వినియోగ సమస్యలను పరిష్కరించడానికి, డిస్నీ+ హాట్‌స్టార్ వీడియో డెలివరీని ఆప్టిమైజ్ చేసింది. తక్కువ డేటా వినియోగంతో హై-క్వాలిటీ స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. ఈ అప్‌గ్రేడ్ వినియోగదారులు డేటా ఛార్జీల గురించి చింతించకుండా లైవ్ క్రికెట్‌ను ఆస్వాదించడానికి అనుమతిస్తుంది.

Disney Plus Hotstar to Stream ICC Cricket World Cup, adds new features to enhance viewing experience in Telugu

ODI World Cup 2023 : Disney Plus Hotstar to Stream ICC Cricket World Cup

3. AI-Powered Video Clarity: డిస్నీ+ హాట్‌స్టార్ AI-ఆధారిత వీడియో క్లారిటీ మెరుగుదలలతో క్రికెట్ వీక్షించే ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ మెరుగుదలతో వ్యూ క్వాలిటీని పెంచుతాయి. ముఖ్యంగా మ్యాచ్‌ల సమయంలో మబ్బుగా ఉండే వాతావరణ పరిస్థితుల్లోనూ క్వాలిటీ వ్యూతో వీక్షించవచ్చు.

4. Always-On Cricket Scorecard : వినియోగదారులు ప్లాట్‌ఫారమ్‌లో మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు లైవ్ క్రికెట్ యాక్షన్ గురించి అప్‌డేట్‌గా ఉండవచ్చు. లైవ్ మ్యాచ్‌కి సులభంగా యాక్సెస్‌తో గేమ్‌లోని కీలకమైన క్షణాలను ఎప్పటికీ కోల్పోకుండా చూసుకోవచ్చు.

5. Live Feed Tab : లైవ్ ఫీడ్ ట్యాబ్ వీక్షకులకు మెరుగైన యాంకర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ప్లేయర్ గణాంకాలు, మ్యాచ్ అప్‌డేట్‌ల వంటి సందర్భోచిత సమాచారాన్ని అందిస్తుంది.

6. Content Discovery : డిస్నీ+ హాట్‌స్టార్ రాబోయే కంటెంట్‌పై రిమైండర్‌లను సెట్ చేసేందుకు ‘Coming Soon’ ట్రేని ప్రవేశపెట్టింది. అదనంగా, ఫ్రీ, పేమెంట్ కంటెంట్ అందిస్తుంది. హైలైట్ చేసిన ‘ఫ్రీ కాల్‌అవుట్‌లతో’ ఉచిత వినియోగదారుల కోసం కంటెంట్ అందిస్తుంది.

7. Free Badges – New Tray Formats : ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ సమయంలో, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్లు కానివారు ‘ఉచిత బ్యాడ్జ్‌ల’ ద్వారా అనేక ఉచిత కంటెంట్ ఆఫర్‌లను అన్వేషించవచ్చు. కొత్త ట్రే ఫార్మాట్‌లతో కంటెంట్‌ను కనుగొనవచ్చు.

Read Also : Honor 90 5G Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ. 11వేల లోపు ధరకే హానర్ 90 5G సిరీస్.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!