జియో ఫస్ట్ డే ఫస్ట్ షో : డోంట్ కేర్ అంటున్న PVR మల్టిప్లెక్స్

జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులో భాగంగా జియో ఫస్ట్ డే.. ఫస్ట్ షో అని రిలయన్స్ RIL చైర్మన్ ముకేశ్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో మల్టీప్లెక్స్ సెక్టార్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

  • Published By: sreehari ,Published On : August 30, 2019 / 02:09 PM IST
జియో ఫస్ట్ డే ఫస్ట్ షో : డోంట్ కేర్ అంటున్న PVR మల్టిప్లెక్స్

జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులో భాగంగా జియో ఫస్ట్ డే.. ఫస్ట్ షో అని రిలయన్స్ RIL చైర్మన్ ముకేశ్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో మల్టీప్లెక్స్ సెక్టార్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులో భాగంగా జియో ఫస్ట్ డే.. ఫస్ట్ షో అని రిలయన్స్ RIL చైర్మన్ ముకేశ్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో మల్టీప్లెక్స్ సెక్టార్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొత్తగా రిలీజ్ అయిన మూవీలను ఇంట్లోనే కూర్చొనే చూస్తే మల్టిప్లెక్సులకు ఎవరూ వస్తారనే సందేహాలు వ్యక్తమయ్యాయి. జియో టీవీలో ఫస్ట్ డే ఫస్ట్ షో చూపించడం ద్వారా ఫ్యామిలీ అంతా కలిసి ఒకేచోట కొత్త మూవీలు చూసే అవకాశం ఉంటుంది. ఓటీటీ (ఓవర్ ది టాప్) ప్లాట్ ఫాంల కారణంగా థియేటర్లు, మల్టిప్లెక్సులపై తీవ్ర ప్రభావం పడుతుందని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దీనిపై ప్రపంచ మల్టిప్లెక్స్ కంపెనీ PVR స్పందిస్తూ.. OTT ప్లాట్ ఫాంలో పోటీతత్వం కారణంగా మల్టిప్లెక్సులు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని స్పష్టం చేసింది. OTT ప్లేయర్ల ప్రకటనలపై తమకు ఎలాంటి భయం లేదని పీవీఆర్ ఎగ్జిక్యూటీవ్ ఒకరు తెలిపారు. ఫిల్మ్ మేకర్లకు వచ్చే రెవిన్యూలో అధికంగా 70-75 శాతం థియేట్రికల్ రిలీజ్ చేయడంపైనే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. థియేట్రికల్ కాంట్రాక్టుతో తమ మూవీలను రిలీజ్ చేసేందుకు ఫిల్మ్ మేకర్లకు ఎలాంటి ఎకనామిక్ లాజిక్ అవసరం లేదన్నారు. 

మరో కారణం ఏంటంటే? కస్టమర్లు ఏదైనా కొత్త మూవీని OTT ప్లాట్ ఫాంల్లో చూడటానికి పెద్దగా ఇష్టపడరని, బిగ్ స్ర్కిన్లపైనే వీక్షిస్తేనే థ్రిల్ గా ఫీల్ అవుతారని పీవీఆర్ సీఈఓ నితిన్ సూద్ అభిప్రాయపడ్డారు. ఇంట్లో కూర్చొని చూడటం కంటే బిగ్ స్ర్కీన్ పై చూస్తే ఆ ఫీల్ డిఫరెంట్ గా ఉంటుందని అన్నారు. అసలు ఈ రెండింటీ అనుభవాలను ఒకే మాదిరిగా పోల్చలేమన్నారు.

జియో ఫైబర్ ప్రకటనలో ఇతర సంస్థలు తమ ఉనికిని కోల్పోవచ్చు గానీ బిగ్ స్ర్కీన్ల విషయంలో మాత్రం అది సాధ్యపడదని ఆయన స్పష్టం చేశారు. జియో ఫస్ట్ షో కారణంగా పీవీఆర్ కు వచ్చిన నష్టమేమి ఉండదని, థియేటర్ కు వచ్చే చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోదని పైగా పీవీఆర్‌లో కూర్చొని తింటూ మూవీ చూస్తారని సూద్ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలే PVR టైర్-2, టైర్-3 సిటీల్లో కొత్త మల్టిప్లెక్స్ ఫూట్ ఫ్రింట్ విస్తరించింది. పీవీఆర్ సబ్ బ్రాండ్ PRV UTSAV పేరుతో ప్రకటించింది. 

పీవీఆర్ ఫస్ట్ మల్టిప్లెక్స్ ను మధ్యప్రదేశ్ లోని శాంటాలో ప్రారంభించింది. త్వరలో పీవీఆర్‌లో రూ. 100 నుంచి రూ.150 మధ్య ఉండేలా తక్కువ ధరకే టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులను మల్టిప్లెక్స్‌ల వైపు ఆకర్షితులను చేయడమే PVR లక్ష్యంగా పెట్టుకుంది. పీవీఆర్ సినిమాకు ఇప్పుడు మొత్తం 797 స్ర్కీన్లు ఉన్నాయి. మరోవైపు రిలయన్స్ జియో టెలికం రంగాన్ని కుదిపేసిన అనంతరం ఎంటర్ టైన్ మెంట్ రంగంపై కన్నేసింది. ప్రస్తుతం రిలయన్స్ జియో సొంత OTT ప్లాట్ ఫాం జియో సినిమా సర్వీసు ఉండగా.. ఇతర OTT ప్లాట్ ఫాంలైన Alt Balajiలో కూడా పెట్టుబడి పెట్టినట్టు సమాచారం.