జనవరి 15 వచ్చేస్తోంది..ఫాస్టాగ్ తీసుకున్నారా 

  • Published By: madhu ,Published On : January 6, 2020 / 11:41 AM IST
జనవరి 15 వచ్చేస్తోంది..ఫాస్టాగ్ తీసుకున్నారా 

జనవరి 15వ తేదీ దగ్గర పడుతోంది. ఆ రోజు నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి కానుంది. ఫాస్టాగ్ టోకెన్ల కొరత, ఇతరత్రా సమస్యలు ఏర్పడడంతో డిసెంబర్ 15 వరకున్న గడువును జనవరి 15 వరకు పొడిగించారు. కానీ ఇంకా చాలా మంది ఫాస్టాగ్ అంటే ఏమిటీ ? ఎక్కడ తీసుకోవాలి ? తదితర వివరాలు తెలవడం లేదు. సో..మీ కోసం కొన్ని విషయాలు.

* ఫాస్టాగ్ అనేది వాహనం ముందట అద్దంపై అతికించబడుతుంది. ఇది RFID టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. మీ బ్యాంకు ఖాతా నుంచి నేరుగా లేదా ఫాస్ట్ ట్యాగ్ లింక్డ్ వాలెట్ నుంచి నగదు రహిత చెల్లింపులు జరుగుతాయి. టోల్ గేట్ దాటిన అనంతరం సంబంధిత ఫోన్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. 
* ఫాస్ట్ ట్యాగ్ కొనసడానికి బ్యాంకు శాఖకు వెళ్లవచ్చు. రోడ్ ట్రాన్స్ పోర్టు కార్యాలయాలు, బ్యాంకులు ఏర్పాటు చేసిన స్టాల్స్, ఇతర ప్రాంతాల్లో ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేయవచ్చు.

* అమెజాన్, పేటీఎం ఆన్ లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. అది మీ బ్యాంక్ ఖాతాకు అనుసంధానించబడుతుంది. బ్యాంకు ఖాతాలో సరిపడ బ్యాలెన్స్ మాత్రం మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. 
* ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేయడానికి రూ. 250 సెక్యూర్టీ డిపాజిట్, రూ. 100 వన్ టైమ్ ట్యాగ్ జాయినింగ్ ఫీజు వర్తిస్తుంది. టోల్ ఫీజు వేర్వేరు వాహనాలకు భిన్నంగా ఉంటుంది. 
 

Class 4- Car / Jeep / Van: Rs. 150
Class 5- Light Commercial Vehicle – 2 axle: Rs. 200
Class 6- Bus, Truck – 3 axle: Rs. 350
Class 7- Bus – 2 axle / Minibus, Truck– 2 axle: Rs. 250
 

Class 12- Tractor / Tractor with trailer, Truck 4, 5 & 6 axle: Rs. 450
Class 15- Truck 7– axle and above: Rs. 550
Class 16- Earth Moving / Heavy Construction Machinery: Rs. 650
RFID (రెడియో ప్రీకెన్సీ ఐడెంటిఫికేషన్) ఆధారంగా ఫాస్టాగ్ పనిచేస్తాయి. 
 

దీని వాలెడిటీ ఐదేళ్లు ఉంటుంది. ఒక్కసారి తీసుకుంటే..ఐదు సంవత్సరాలు బేఫికర్.
ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేసిన అనంతరం వాహనానికి సంబంధించిన వివరాలను ఎంట్రీ చేయాలి. ఇందుకోసం ఫాస్ట్ ట్యాగ్ యాప్‌ని డౌన్ లోడ్ చేసుకోవాలి. 
బ్యాంకు ఖాతాకు బదులుగా డిజిటల్ వాలెట్‌ను ఉపయోగించుకొనే స్వేచ్చ ఉంటుంది. 
ఫాస్టాగ్‌ను వెహికల్ అద్దంపై అతికిస్తారు. టోల్ ప్లాజాల వద్ద వెళ్లేటప్పుడు ఆటోమెటిక్‌గా టోల్ ఛార్జీలు కట్ అవుతాయి. ఇందుకు వెహికల్‌ను ఆపాల్సిన అవసరం లేదు. 
టోల్ ప్లాజాల వద్ద వెహికల్ వెళ్లేటప్పడు అద్దంపైనున్న ఫాస్టాగ్‌ను స్కాన్ చేస్తుంది. అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. 
అనంతరం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు డబ్బులు కట్ అయినట్లు SMS వస్తుంది. 

ఉదా : మీ ఫాస్ట్ ట్యాగ్ ఖాతాను Paytm Walletతో లింక్ చేయవచ్చు. వాహనం టోల్ ప్లాజాను దాటిన ప్రతిసారి, మీ Paytm Wallet నుంచి మొత్తం తీసివేయబడుతుంది. 

Read More : హస్తిన నగారా : కేజ్రీ చక్రం తిప్పేనా