Forbes India Billionaires List 2022 : ఆసియా కుబేరుడుగా ముఖేశ్ అంబానీ అగ్రస్థానం, రెండో స్థానంలో అదానీ..!

Forbes India Billionaires List 2022 : ఫోర్బ్స్ బిలియనీర్స్ ఇండియా జాబితా (Forbes India Billionaires List)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు.

Forbes India Billionaires List 2022 : ఆసియా కుబేరుడుగా ముఖేశ్ అంబానీ అగ్రస్థానం, రెండో స్థానంలో అదానీ..!

Forbes India Billionaires List 2022 Mukesh Ambani Tops Rich List, Adani Takes 2nd Spot (1)

Forbes India Billionaires List 2022 : ఫోర్బ్స్ బిలియనీర్స్ ఇండియా జాబితా (Forbes India Billionaires List)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. అంబానీ తర్వాత అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ (Gautam Adani) రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత భారత టాప్ బిలియనీర్ల జాబితాలో HCL టెక్నాలజీస్ చైర్మన్ శివ్‌నాడర్ 3 స్థానంలో నిలిచారు. 2021 ఫోర్బ్స్ జాబితాలో కూడా ఇదే ముగ్గురు ఒకే స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. ముఖేష్ అంబానీ సంపద గత ఆర్థిక ఏడాది 7 శాతం పెరిగి 90.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మన కరెన్సీలో రూ.6.8 లక్షల కోట్లు అనమాట.. ఆసియా కుబేరుడుగా, ప్రపంచ బిలియనీర్లలో 10 బిలియనీర్‌గా ముఖేష్ అంబానీ నిలిచారు.

ఆ తర్వాత అదానీ 90 బిలియన్ డాలర్ల సంపదతో (రూ.6.75 లక్షల కోట్లు) రెండో స్థానంలో ఉన్నారు. శివ్‌నాడర్ సంపద 28.7 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత సైరస్ పూనావాలా సంపద 24.3 బిలియన్ డాలర్లకు పెరగడంతో ఆయన 4వ స్థానంలో నిలిచారు. డీమార్ట్ అధినేత రాధాకిషన్ 20 బిలియన్ డాలర్లతో 5వ స్థానంలో నిలిచారు. ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ 17.9 బిలియన్ డాలర్లతో 6వ స్థానంలో నిలిచారు.

ఓపీ జిందాల్ గ్రూప్ సావిత్రి జిందాల్ 17.7 బిలియన్ డాలర్లతో 7వ స్థానంలో నిలవగా, ఆదిత్య బిర్లా గ్రూప్ చీఫ్ కుమార్ మంగళం బిర్లా 16.5 బిలియన్ డాలర్లతో 8వ స్థానంలో నిలిచారు. చివరి రెండు స్థానాల్లో సన్ ఫార్మాస్యూటికల్స్ హెడ్ దిలీప్ శంగ్వీ 15.6 బిలియన్ డాలర్లతో 9వ స్థానంలో, కొటక్ మహీంద్రా బ్యాంకు ఎండీ ఉదయ్ కొటక్ 14.3 బిలియన్ డాలర్లతో 10వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఫోర్బ్స్ ఇండియా బిలియనీర్ల జాబితాలో 166కు బిలియనీర్లు పెరిగారు. భారత్‌లో బిలియనీర్స్ సంఖ్య 144 నుంచి 166కు పెరిగింది. 166 మంది కుబేరుల సంపద గత ఏడాది 26 శాతం పెరిగి 750 బిలియన్ డాలర్లకు (రూ.56 లక్షల కోట్లకు) చేరుకుంది.

Forbes India Billionaires List 2022 Mukesh Ambani Tops Rich List, Adani Takes 2nd Spot

Forbes India Billionaires List 2022 Mukesh Ambani Tops Rich List, Adani Takes 2nd Spot

ప్రపంచ బిలియనీర్స్‌లో టాప్ 12 జాబితాలో ముఖేష్ అంబానీతో పాటు అదానీ మాత్రమే ఉన్నారు. భారత్‌లో, అందులోనూ ఆసియాలో అత్యధిక ధనికులు వీరిద్దరే ఉన్నారు. ఉక్కు ధరలు పెరగడంతో సావిత్రి జిందాల్ ఈ ఏడాది 10 మంది కుబేరుల జాబితాలో చేరారు. కుబేరుల మొత్తం జాబితాలో 13 మంది మహిళా కుబేరుల్లో సావిత్రి కూడా ఉన్నారు. కొత్తగా వచ్చిన 29 మందిలో పాల్గుణి నాయర్ కూడా ఉన్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ (288 బిలియన్ డాలర్లు), జెఫ్ బెజోస్ (193 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ అర్నాల్ట్ (150 బిలియన్ డాలర్లు), బిల్ గేట్స్ (134 బిలియన్ డాలర్లు), లారీ పేజ్ (127 బిలియన్ డాలర్లు), వారెన్ బఫెట్ (125 బిలియన్ డాలర్లు), సెర్జీ బ్రిన్ (122 బిలియన్ డాలర్లు), స్టీవ్ బాల్మర్ (110 బిలియన్ డాలర్లు), లారీ ఎలిశన్ (106 బిలియన్ డాలర్లు) ఉన్నారు.

Read Also : Mukesh Ambani: భారత్ లోనే అత్యంత ఖరీదైన కారును సొంతం చేసుకున్న ముకేశ్ అంబానీ