Twitter X Logo : మస్క్ వెనక్కి తగ్గేదే లే.. శాన్‌ఫ్రాన్సిస్కోలో ట్విట్టర్ X లోగో మార్చకుండా అడ్డుకున్న పోలీసులు.. అసలేం జరిగిందంటే?

Twitter X Logo : శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంలో ట్విట్టర్ పాత పేరును తొలగించకుండా పోలీసులు అడ్డుకున్నారు. ట్విట్టర్‌ని (X)గా రీబ్రాండ్ చేయాలనే ఎలన్ మస్క్ ప్రణాళికకు అడ్డంకులు ఎదురయ్యాయి.

Twitter X Logo : మస్క్ వెనక్కి తగ్గేదే లే.. శాన్‌ఫ్రాన్సిస్కోలో ట్విట్టర్ X లోగో మార్చకుండా అడ్డుకున్న పోలీసులు.. అసలేం జరిగిందంటే?

From Twitter to X and Er, cops in San Francisco stop Elon Musk from changing name at Twitter HQ

Twitter X Logo : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter) ఎలన్ మస్క్ ట్విట్టర్‌ని టేకోవర్ చేసుకున్నప్పటి నుంచి కంపెనీలో నిరంతరం మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే మస్క్ ట్విట్టర్ ఐకానిక్ బ్లూ బర్డ్‌ను ‘X’తో భర్తీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ట్విట్టర్ అందించే సర్వీసుల్లో దాదాపుగా బుల్టిపిట్ట స్థానంలో కొత్త X లోగో మారిపోయింది. ట్విట్టర్‌ని ఓపెన్ చేసినప్పుడు యూజర్లందరికి ’X’తో కనిపిస్తోంది.

ట్విట్టర్ లోగోను పూర్తిగా మార్చేయాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే, ట్విట్టర్ శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయం నుంచి పాత పేరును తొలగించి ఆ స్థానంలో కొత్త ’X’ లోగోగా మార్చాల్సిందిగా మస్క్ నిర్ణయించాడు. ట్విట్టర్ పేరు అధికారికంగా మార్చిన వెంటనే చాలా మంది ఉద్యోగులు ట్విట్టర్ పదాలను తొలగించినట్టు గుర్తించారు. అయితే శానిఫ్రాన్సిస్కో హెడ్ క్వార్టర్స్ ముందు ట్విట్టర్ సైన్ బోర్డు తొలగించే అధికారం లేకపోవడంతో స్థానిక పోలీసులు అడ్డుకున్నారు.

Read Also : Twitter logo X: ట్విటర్ లోగో ‘X’ కి మారగానే రైలు వెనకాల ఉండే ‘X’ పై మొదలైన చర్చ.. ఇంతకీ దాని అర్థం ఏంటో తెలుసా?

పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. కంపెనీ సైన్ బోర్డు తొలగించడానికి ముందు సోషల్ మీడియా దిగ్గజం భవనం యజమానికి తెలియజేయడంలో విఫలమైంది. దాంతో భద్రత దృష్ట్యా పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. చివరకు ఎలాంటి నేరం జరగలేదని నిర్ధారణ అయింది. ప్రస్తుతం, ఐకాన్‌లో ఒక వైపు మాత్రమే బ్లూ కలర్ బర్డ్‌తో పాటు ట్విట్టర్ ప్రారంభ పదాలు తొలగించగా  ’er’ అనే అక్షరాలు మాత్రమే చెర్రీ పికర్‌లో కనిపిస్తున్నాయి.

From Twitter to X and Er, cops in San Francisco stop Elon Musk from changing name at Twitter HQ

From Twitter to X and Er, cops in San Francisco stop Elon Musk from changing name at Twitter HQ

ట్విట్టర్ కొత్త లోగో ‘X’ ఐకానిక్ బర్డ్ లోగోను భర్తీ చేస్తుందని ఆదివారం మస్క్ చేసిన ప్రకటించిన సంగతి తెలిసిందే. అదనంగా, మస్క్ ఇప్పటికే కాన్ఫరెన్స్ రూంలకు పేరు మార్చారు. ప్రధాన కార్యాలయంలో ’X’ అక్షరాన్ని చేర్చడానికి ముందు మస్క్ ’s3xy’ ’ఎక్స్‌పోజర్’ వంటి పేర్లను స్వీకరించారు. ఈ రీబ్రాండింగ్ ప్రయత్నం ఇప్పటిది కాదు.. గత ఏడాదిలో 44 బిలియన్లకు ట్విట్టర్‌ను మస్క్ కొనుగోలు చేసినప్పటి నుంచి ప్లాట్‌ఫారమ్‌కు ఇదే పేరును పెట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అయితే, ఈ X రీబ్రాండ్ పేరు మార్పు అత్యంత వివాదాస్పదంగా మారింది.

ట్విట్టర్ కొత్తగా నియమితులైన CEO లిండా యక్కరినో కూడా సోమవారం ఒక ట్వీట్‌లో రీబ్రాండింగ్ గురించి తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ట్విట్టర్ కమ్యూనికేట్ చేసే విధానంతో పాటు గ్లోబల్ టౌన్ స్క్వేర్‌ను మార్చడంలో X మరింత ముందుకు వెళ్తుందని పేర్కొంది. ఈ క్రమంలోనే మస్క్ రీబ్రాండింగ్, కాన్ఫరెన్స్ రూమ్‌ల పేరు మార్చడంతో పాటు కొత్త X లోగోను ప్రొజెక్ట్ చేయడం, ప్లాట్‌ఫారమ్‌లో మార్పుకు హామీ ఇవ్వడంతో మస్క్ ముందుకు కొనసాగాడు.

Read Also : Apple iOS 16.6 Update : ఆపిల్ iOS 16.6 అప్‌డేట్ ఇదిగో.. మీ ఐఫోన్ ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి.. బగ్స్ ఇష్యూకు చెక్ పెడినట్టే..!