Hindenburg Report On ADANI Group: 6 గంటల్లో 1.60 లక్షల కోట్లు కోల్పోయిన గౌతమ్ అదానీ

Hindenburg Report On ADANI Group: హిండన్‌బర్గ్ రిపోర్టుతో అదానీ ఆస్తులు ఐస్బర్గ్లా కరిగిపోతున్నారు. ఇప్పటికే 4 లక్షల కోట్ల రూపాయలు (20 బిలియన్ డాలర్లు) పైగా నష్టపోయిన అదానీ తాజాగా మరింత పెద్ద నష్టాన్ని చవిచూశారు. శుక్రవారం నాటి ట్రేడింగు ప్రకారం కేవలం 6 గంటల్లోనే 1.60 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఆవిరైపోయింది. ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద మొత్తంలో లాస్ రావడం అదానీ వ్యాపార జీవితంలో ఇదే మొదటిసారి అని వ్యాపార వర్గాలు వెల్లడించాయి. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం.. అదానీ ఆస్తుల విలువ 92.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
Vande Bharat Express: అత్యాధునిక వందే భారత్ రైలును చెత్తతో నింపేసిన ప్రయాణికులు
గౌతమ్ అదానీ.. ఇండియాలో అంబానీ ఎంత ఫేమస్సో.. అదానీ కూడా అంతే పాపులర్. అంతేకాదు.. ఇప్పుడు అంబానీ కంటే ఓ మెట్టు మీదే ఉన్నారు. ప్రపంచ కుబేరుల్లో రెండు రోజుల క్రితం వరకూ మూడో స్థానంలో వెలిగారు అంబానీ. ఒకానొక సమయంలో రెండవ స్థానంలో కొనసాగారు. దీనంతటికీ కారణం.. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఇప్పుడివే కంపెనీలు.. అదానీ భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చబోతున్నాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత.. మార్కెట్‌లో నెలకొన్న అనుమానాలు, స్టాక్స్‌లో వస్తున్న మార్పులు అదే విషయాన్ని తెలియజేస్తున్నాయి.
YS Viveka Murder Case : సీబీఐ విచారణకు వెళ్తూ .. వైఎస్ విజయలక్ష్మితో వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి భేటీ
అపర కుబేరుడు అదానీకి చెందిన కంపెనీలన్ని అప్పుల కుప్పల్లా మారాయని అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ సంచలన రిపోర్ట్ ఇచ్చింది. ప్రమోటర్ల మార్కెట్ మ్యాజిక్‌తో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల షేర్ల ధరలకు రెక్కలొచ్చి చుక్కల దాకా చేరాయ్. అవి ఎప్పుడైనా కుప్పకూలే ప్రమాదం ఉందని, వాటిలో పెట్టుబడులు ఎంతమాత్రం మంచిది కాదని ఈ రిపోర్ట్ క్లారిటీ ఇచ్చేసింది. అంతే, ఇక అదానీ కంపెనీల షేర్లన్నీ పాతాళానికి పడిపోవడం ప్రారంభించాయి. ఇప్పటికే లక్షల కోట్లు లాసైన అదానీ గ్రూఫ్ ఆఫ్ కంపెనీలు మరింత నష్టాన్ని చవిచూడబోతున్నట్లు ప్రస్తుత పరిస్థితులను చూస్తే తెలుస్తోంది.
#BharatJodoYatra: భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ
గడిచిన మూడేళ్లలో అదానీ గ్రూప్ కంపెనీలు ఊహించని స్థాయిలో మార్కెట్‌లో ఎదిగాయి. ఇదే సమయంలో ఏడు లిస్టెడ్ కంపెనీల షేర్ల ధర 819 శాతం పెరిగింది. ఇదే ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయాన్ని కూడా హిండెన్‌బర్గ్ తన రిపోర్టులో ప్రస్తావించింది. ఈ సూపర్ డూపర్ ర్యాలీ వెనుక ప్రమోటర్ల హస్తం ఉందని ఆరోపించింది. అక్రమంగా షేర్ల ధరలు పెంచి, అధిక రేట్లకు దొరికిన చోటల్లా అదానీ గ్రూప్ అడ్డగోలుగా అప్పులు చేసినట్లు చెబుతోంది రిపోర్ట్. అదానీ గ్రూప్ 12 వేల కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌లో 10 వేల కోట్ల డాలర్ల నెట్‌వర్త్ గడిచిన మూడేళ్లలోనే సమకూరడంపై కూడా సందేహాలు తలెత్తుతున్నాయ్. గతేడాది మార్చి నాటికి అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల అప్పు 2 లక్షల 20 వేల కోట్లు. అందులో 40 శాతం అంటే 88 వేల కోట్లు ఒక్క ఏడాదిలోనే పెరిగాయ్.