Honda Extended Warranty Plus : హోండా EW ప్లస్ కస్టమర్లకు అదిరే ఆఫర్.. వారంటీ ప్లస్ ప్రోగ్రామ్ ఎన్నేళ్లకు పెంచిందో తెలుసా?

Honda Extended Warranty Plus : హోండా టూ వీలర్ కస్టమర్లకు అదిరే ఆఫర్.. ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్లస్ (EW Plus)ని ఆవిష్కరించింది. ఎన్ని సంవత్సరాల వరకు ఈ వారంటీ పొడిగించిందో తెలుసా?

Honda Extended Warranty Plus : హోండా EW ప్లస్ కస్టమర్లకు అదిరే ఆఫర్.. వారంటీ ప్లస్ ప్రోగ్రామ్ ఎన్నేళ్లకు పెంచిందో తెలుసా?

Honda introduces Extended Warranty Plus program for two-wheelers

Honda Extended Warranty Plus program : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ (Honda MotorCycle) స్కూటర్ ఇండియా 250cc వరకు ఉన్న మోడళ్ల కోసం ఇతర బెనిఫిట్స్‌తో పాటు 10 ఏళ్ల వరకు వారంటీ కవరేజీని అందిస్తోంది. ఈ మేరకు ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్లస్ (EW Plus) అనే కొత్త ప్రోగ్రామ్ ఆవిష్కరించింది.

ప్రత్యేకించి EW Plus కస్టమర్‌లు వాహనం కొనుగోలు చేసిన తేదీ నుంచి (91 రోజుల నుంచి) 9వ సంవత్సరం వరకు సౌకర్యవంతమైన విండోలో పొడిగించిన వారంటీని ఎంచుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ కస్టమర్‌లకు సమగ్ర 10-ఏళ్ల వారంటీ కవరేజీని అందిస్తుంది. ఒకవేళ మీ వెహికల్ మరొకరికి ట్రాన్స్‌ఫర్ చేసినా రీసేల్ ఆప్షన్లను కూడా అందిస్తుంది. EW Plus ఇంజిన్ పార్టులతో పాటు ఇతర అవసరమైన మెకానికల్, ఎలక్ట్రికల్ పార్టుల కోసం సమగ్ర కవరేజీని అందిస్తుంది.

ఈ ప్రొగ్రామ్ కింద హోండా కస్టమర్‌లకు 3 సౌకర్యవంతమైన ఆప్షన్లను ఎంచుకోవచ్చు. 7వ సంవత్సరం వరకు వాహనాలకు 3 ఏళ్ల పాలసీ, 8వ సంవత్సరంలో వాహనాలకు 2 ఏళ్ల పాలసీతో పాటు 9వ సంవత్సరంలో వాహనాలకు ఒక ఏడాది పాలసీని ఎంచుకోవచ్చు. ఈ ఆప్షన్లలన్నీ స్కూటర్ మోడల్‌లకు 120,000 కిలోమీటర్ల వరకు అన్ని మోటార్‌సైకిల్ మోడల్‌లకు 130,000 కిలోమీటర్ల వరకు కవరేజీని అందిస్తాయి.

Read Also : Maruti Premium MPV : హైటెక్ ఫీచర్లతో మారుతి కొత్త ప్రీమియం MPV వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడు? ధర ఎంత ఉండొచ్చుంటే?

EW Plus ప్రోగ్రామ్‌కు ప్రారంభ ధర రూ. 1,317 (150cc వరకు ఉన్న మోడళ్లకు). 150CC నుంచి 250CC మధ్య ఉన్న మోడళ్లకు రూ.1,667 ఖర్చవుతుంది. అయితే, వాహనం కొనుగోలు చేసిన సంవత్సరం ఆధారంగా ధర మారుతూ ఉంటుంది. EW Plus ప్రోగ్రామ్‌ను ఏదైనా అధీకృత హోండా సర్వీస్ సెంటర్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

EW Plus స్పెషిఫికేషన్లు ఇవే :
సేల్ టర్మ్ : వాహనం కొనుగోలు చేసిన తేదీ నుంచి 91 రోజుల నుంచి 9వ సంవత్సరం వరకు.

Honda introduces Extended Warranty Plus program for two-wheelers

Honda introduces Extended Warranty Plus program for two-wheelers

పాయింట్ ఆఫ్ సేల్ : వర్క్‌షాప్.
పాలసీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి . 7 ఏళ్లకు చేరిన వాహనం వరకు 3ఏళ్ల పాలసీ, 8వ సంవత్సరం గల వాహనానికి 2-సంవత్సరాల పాలసీ, 9వ సంవత్సరం వాహనానికి ఒక ఏడాది పాలసీ వర్తిస్తుంది.
ఇప్పటికే ఉన్న EW కస్టమర్లు, నాన్-EW కస్టమర్‌లకు కూడా అవకాశం ఉంటుంది.

కస్టమర్ల ప్రయోజనాలివే :
* కస్టమర్లకు ‘మనశ్శాంతి’ని అందించే కస్టమర్ రిటెన్షన్ టూల్
* ఏదైనా తయారీ లోపం కారణంగా సంభవించిన వైఫల్యాన్ని కవర్ చేస్తుంది.
* 10 సంవత్సరాల వరకు వారంటీ కవరేజీ.
* రెగ్యులర్ మెయింట్‌నెన్స్‌తో లాంగ్ వెహికల్ లైఫ్.. వాహనం అధిక రీసేల్ వాల్యూ బెనిఫిట్స్ అందిస్తుంది.
* వాహనం కొనుగోలు చేసిన 9 ఏళ్ల వరకు రీసేల్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
* ఆల్ ఇండియా కేపబిలిటీ వర్తిస్తుంది.
* పాలసీని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

Read Also : Tata Motors: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టాటా మోటర్స్ ప్రత్యేకమైన కస్టమర్ ఎంగేజ్‌మెంట్ ప్రోగ్రాం