Hyundai Verna 2023 : వచ్చే ఏప్రిల్ నుంచే హ్యుందాయ్ వెర్నా 2023 డెలివరీలు.. ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం..!

Hyundai Verna 2023 : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హ్యుందాయ్ వెర్నా 2023 (Hyundai Verna 2023) లాంచ్ తేదీ ఇప్పటికే ప్రకటించింది. అలాగే, హ్యుందాయ్ వెర్నా 2023 బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.

Hyundai Verna 2023 : వచ్చే ఏప్రిల్ నుంచే హ్యుందాయ్ వెర్నా 2023 డెలివరీలు.. ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం..!

Hyundai Verna 2023 deliveries to start in mid-April

Hyundai Verna 2023 : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హ్యుందాయ్ వెర్నా 2023 (Hyundai Verna 2023) లాంచ్ తేదీ ఇప్పటికే ప్రకటించింది. అలాగే, హ్యుందాయ్ వెర్నా 2023 బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. హ్యుందాయ్ వెర్నా 2023 ధరలు ఇంకా రిలీజ్ కానప్పటికీ, కారు డెలివరీలు ఏప్రిల్ మధ్యలో ప్రారంభమవుతాయని సంబంధిత డీలర్ వర్గాలు వెల్లడించాయి.

హ్యుందాయ్ వెర్నా 2023 ధర :
భారత మార్కెట్లో హ్యుందాయ్ వెర్నా 2023 ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 17 లక్షల (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) పరిధిలో ఉండనుంది.

హ్యుందాయ్ వెర్నా 2023 బుకింగ్స్ :
సరికొత్త 6వ జనరేషన్ వెర్నాను హ్యుందాయ్ డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రూ. 25వేల టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

Read Also : OnePlus Nord CE 3 Leak : సరసమైన ధరకే వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫుల్ ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

హ్యుందాయ్ వెర్నా 2023 లాంచ్ తేదీ :
కొత్త వెర్నా మార్చి 21న భారత్‌లో లాంచ్ కానుంది.

Hyundai Verna 2023 deliveries to start in mid-April

Hyundai Verna 2023 deliveries to start in mid-April

హ్యుందాయ్ వెర్నా 2023 పవర్‌ట్రెయిన్‌లు :
2023 వెర్నాలో 1.5-లీటర్ MPi పెట్రోల్ ఇంజన్ వస్తుంది. దీనిని 6-స్పీడ్ MT లేదా IVT ఆటోమేటిక్‌తో కలిసి వస్తుంది. 1.5-లీటర్ టర్బో GDi పెట్రోల్ ఇంజన్, 6-స్పీడ్ MT, 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. రెండు ఇంజన్‌లు రాబోయే రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలకు లోబడి ఉంటాయి.

హ్యుందాయ్ వెర్నా 2023 కొలతలు :
హ్యుందాయ్ ఇటీవలే 2023 వెర్నా కొలతలు వెల్లడించింది. దీని పొడవు 4,535mm, వెడల్పు 1,765mm, ఎత్తు 1,475mm. వీల్ బేస్ 2,670mm పొడవు ఉంది. కొత్త వెర్నా హోండా సిటీ 2023 కన్నా వెడల్పుగా ఉంది. హోండా ఫ్లాగ్‌షిప్ సెడాన్ కన్నా ఎక్కువ వీల్‌బేస్‌ను కలిగి ఉంది. కొత్త వెర్నాలో 528 లీటర్ల సెగ్మెంట్-బెస్ట్ బూట్ స్పేస్ ఉంది.

Read Also : Women Entrepreneurs : మహిళా స్టార్టప్‌ల కోసం 91 స్ర్పింగ్ బోర్డ్, గూగుల్ ‘లెవల్ అప్’ ప్రొగ్రామ్‌.. 11 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారికత!