Women Entrepreneurs : మహిళా స్టార్టప్‌ల కోసం 91 స్ర్పింగ్ బోర్డ్, గూగుల్ ‘లెవల్ అప్’ ప్రొగ్రామ్‌.. 11 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారికత!

Women Entrepreneurs : భారత్‌లో ప్రముఖ కో-వర్కింగ్ కమ్యూనిటీలలో ఒకటైన 91స్ప్రింగ్‌బోర్డ్, గూగుల్ ఫర్ స్టార్టప్స్ (GFS) భాగస్వామ్యంతో ‘లెవల్ అప్’ ప్రొగ్రామ్‌ను నిర్వహిస్తోంది. ఈ ప్రొగామ్‌లో భాగంగా హైదరాబాద్ నుంచి 11 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఎంపిక చేశారు.

Women Entrepreneurs : మహిళా స్టార్టప్‌ల కోసం 91 స్ర్పింగ్ బోర్డ్, గూగుల్ ‘లెవల్ అప్’ ప్రొగ్రామ్‌.. 11 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారికత!

List of women entrepreneurs selected from Hyderabad for the Level-Up program

Women Entrepreneurs : భారత్‌లో ప్రముఖ కో-వర్కింగ్ కమ్యూనిటీలలో ఒకటైన 91స్ప్రింగ్‌బోర్డ్ (91 Springboard), గూగుల్ (Google) ఫర్ స్టార్టప్స్ (GFS) భాగస్వామ్యంతో ‘లెవల్ అప్’ ప్రొగ్రామ్‌ను నిర్వహిస్తోంది. ఈ ప్రొగామ్‌లో భాగంగా మొదటి గ్రూప్ కోసం హైదరాబాద్ నుంచి 11 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఎంపిక చేశారు. ఈ వర్చువల్ ప్రోగ్రామ్ ద్వారా ఆధునిక డిజిటల్ బిజినెస్ టూల్స్‌ను నేర్చుకోవచ్చు. తద్వారా దేశవ్యాప్తంగా వివిధ స్టార్టప్‌లకు, వ్యాపారవేత్తలకు ఆన్‌లైన్‌లో తమ వ్యాపారాలను విస్తరించడానికి అవకాశాన్ని అందిస్తోంది. అంతేకాదు.. మహిళా పారిశ్రామికవేత్తలు తమ స్టార్టప్‌లకు నిధులు సమకూర్చడానికి, తమ బిజినెస్ విస్తరించుకోవడానికి వీలు కల్పిస్తుంది.

Read Also : OnePlus Nord CE 3 Leak : సరసమైన ధరకే వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫుల్ ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ఈ ప్రొగ్రామ్‌లో పాల్గొనే మహిళా పారిశ్రామికవేత్తలు ఇప్పటికే ఆరోగ్యసంరక్షణ, విద్య, పర్యావరణం, సాఫ్ట్‌వేర్,ఇంటర్నెట్, రవాణాతో పాటు ఇతర పరిశ్రమల రంగాలలో రాణిస్తున్నారు. లెవల్ అప్ ప్రొగ్రామ్ ద్వారా తమ బ్రాండ్లను భారతీయ స్టార్టప్ వ్యవస్థలో మరింత విస్తరించుకోవచ్చు. గూగుల్, ఇతర సంస్థలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తల స్టార్టప్‌లకు నిష్ణాతులైన సలహాదారుల నుంచి అవసరమైన మార్గదర్శకాలను అందించడమే ‘లెవల్ అప్ ప్రొగ్రామ్’లక్ష్యం. అయితే, ఇందులో సలహాదారులు మార్గదర్శకులుగా వ్యవహరించారు. ఆయా సవాళ్ళపై మహిళా వ్యవస్థాపకులతో కలసి పనిచేశారు.

List of women entrepreneurs selected from Hyderabad for the Level-Up program

List of women entrepreneurs selected from Hyderabad for the Level-Up program

తమ వ్యాపారాన్ని X నుంచి 10x వరకు పెంచేందుకు అనేక వ్యూహాలను రూపొందించారు. 71 మంది సలహాదారులు వ్యాపారాలను నిర్మించడానికి, వృద్ధిచేయడానికి మాస్టర్‌ క్లాసెస్, ఆన్‌లైన్ పర్మిట్స్, టూల్స్ ద్వారా నైపుణ్యాన్ని పెంచుకునేందుకు  మూడు నెలల పాటు ట్రైనింగ్ అందించారు. ఈ గ్రూప్-1 ప్రొగ్రామ్.. గత 2022 ఆగస్టులో ప్రారంభం కాగా.. 366కిపైగా దరఖాస్తుల్లో 183 మంది మహిళా పారిశ్రామికవేత్తలు మాత్రమే షార్ట్‌ లిస్ట్ అయ్యారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 25 వరకు కొనసాగింది. ఫార్మల్నెట్‌ వర్కింగ్‌ మొత్తం 200+ గంటలకు పైగా మహిళా పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశం చేశారు. ఆన్‌లైన్ పర్మిట్స్ దేశమంతటా 91 స్ప్రింగ్‌ బోర్డ్‌ సెంటర్లలో జరిగాయి.

ఈ సందర్భంగా 91 స్ప్రింగ్‌బోర్డ్ సీఈఓ ఆనంద్ వేమూరి మాట్లాడుతూ.. ‘ఇటీవల మహిళా పారిశ్రామికవేత్తలు స్వతంత్రంగా రాణిస్తున్నారు. మన ప్రభుత్వం కూడా మహిళలకు మద్దతు అందిస్తోంది. అందుకే, 91 స్ప్రింగ్‌ బోర్డ్ద్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తల సాధికారిత కోసం మా వంతు కృషిచేస్తున్నాం. 91 స్ప్రింగ్‌ బోర్డ్ అభ్యాసాలతో మరింత అవకాశాలను అందిస్తున్నాం. లెవల్ అప్ ప్రొగ్రామ్ GFSతో సహకారం మహిళా వ్యవస్థాపకుల్లో మరింత విశ్వాసాన్నిపెంచుతుంది. ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల నుంచి విశేష స్పందన వచ్చింది’ అని పేర్కొన్నారు.

కోహార్ట్-1 (Cohort) ప్రొగ్రామ్‌కు వచ్చిన సానుకూల స్పందన నేపథ్యంలో లెవల్ అప్ ప్రొగ్రామ్ హోర్ట్-2 ఇదే మార్చిలో ప్రారంభమవుతుంది. జూలై 2023 వరకు ఈ ప్రొగ్రామ్ కొనసాగుతుంది. ‘లెవల్ అప్’కార్యక్రమంలో పాల్గొనాలనుకునే మహిళా పారిశ్రామికవేత్తలు ఈ లింక్ (మహిళా స్టార్టప్‌లకు వ్యాపార అవకాశాలు ) ద్వారా రిజిస్టర్ (Register) చేసుకోవచ్చు.

Read Also : Holi Sale 2023 : హోలీ ఫెస్టివల్ సేల్ మొదలైందోచ్.. ఐఫోన్ 14, మ్యాక్‌బుక్ ఎయిర్ 2022, వన్‌ప్లస్ 11R 5G ఫోన్లపై భారీ డీల్స్..!