అంతేగా.. అంతేగా : ఒక్క భారత్ లోనే ఇంటర్నెట్ చీప్

ఇంటర్నెట్ సేవలు ప్రపంచం మొత్తం మీద భారత్ లోనే అత్యంత తక్కువ ధరకు లభిస్తున్నట్లు బ్రిటన్ కు చెందిన కేబుల్ అనే వెబ్ సైట్ తెలిపింది.

  • Published By: venkaiahnaidu ,Published On : March 7, 2019 / 02:03 AM IST
అంతేగా.. అంతేగా : ఒక్క భారత్ లోనే ఇంటర్నెట్ చీప్

ఇంటర్నెట్ సేవలు ప్రపంచం మొత్తం మీద భారత్ లోనే అత్యంత తక్కువ ధరకు లభిస్తున్నట్లు బ్రిటన్ కు చెందిన కేబుల్ అనే వెబ్ సైట్ తెలిపింది.

ఇంటర్నెట్ సేవలు ప్రపంచం మొత్తం మీద భారత్ లోనే అత్యంత తక్కువ ధరకు లభిస్తున్నట్లు బ్రిటన్ కు చెందిన కేబుల్ అనే వెబ్ సైట్ తెలిపింది. అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో అమలవుతున్న ఇంటర్నెట్ సేవల ధరలను పోల్చి చూస్తే సరాసరిగా 1GB ఇంటర్నెట్ ధర రూ.600గా ఉందని,భారత్ లో మాత్రం కేవలం రూ.18.50కే లభిస్తున్నట్లు తెలిపింది.
Also Read: ముషార్రఫ్ సంచలన నిజాలు : జైషే,ISIలు కలిసి భారత్ లో ఉగ్రదాడులు చేశాయి

1GB డేటా పొందాలంటే బ్రిటన్ లో 6.66 డాలర్లు, అమెరికాలో 12.37డాలర్లు,జింబాబ్వేలో అత్యధికంగా 75.20 డాలర్లు,చైనాలో9.89డాలర్లు, శ్రీలంకలో0.87డాలర్లు, బంగ్లాదేశ్‌లో0.99 డాలర్లు, పాకిస్థాన్‌లో1.85 డాలర్లు ఖర్చుపెట్టాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు అందిస్తున్న 6,313 డేటా ఫ్లాన్లను పరిశీలించిన తర్వాత కేబుల్ వెబ్ సైట్ ఈ రిపోర్ట్ ను రిలీజ్ చేసింది.
భారత్‌ లో దాదాపు 430 మిలియన్ల మంది మొబైల్‌ వినియోగదారులు ఉన్నారు. వీరికి సేవలు అందించేందుకు అనేక సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ కారణంగానే భారత్ లో డేటా చీఫ్ గా లభిస్తుంది.ముఖ్యంగా జియో మార్కెట్లోకి వచ్చిన తర్వాత నుంచి డేటా ధరలు మరింత తగ్గిన విషయం తెలిసిందే.
Also Read: తమిళ మంత్రి సంచలన వ్యాఖ్యలు : అమ్మను.. హల్వా పెట్టి చంపేశారు